ట్రాక్టర్ కిందపడి బాలుడి దుర్మరణం
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:33 PM
జోగు ళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన విష్ణుకుమార్ నాయుడు, పార్వతమ్మ రెండో సంతానం కార్తీక్ నాయుడు(4) ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు.
మానవపాడు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జోగు ళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన విష్ణుకుమార్ నాయుడు, పార్వతమ్మ రెండో సంతానం కార్తీక్ నాయుడు(4) ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ నివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కార్తీక్ నా యుడు స్కూల్‌కి వెళ్లేందుకు ఇంటి నుంచి రాగా, ఈ క్ర మంలో రోడ్డుపై ట్రాక్టర్ రివర్స్ వస్తున్న క్రమంలో కా ర్తీక్ నాయుడుపైకి వెళ్లింది. ట్రాలీ టైరు ఎక్కి తలకు రక్త గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంపై విష్ణుకుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.