Share News

ఊట్కూర్‌లో బాలుడికి డెంగీ నిర్ధారణ

ABN , Publish Date - May 03 , 2025 | 11:10 PM

నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండల కేంద్రంలోని గాంధీనగర్‌ విధికి చెందిన ఒక బాలుడికి శనివారం డెంగీ వ్యాధి ని ర్దారణ అయ్యింది. విషయం తెలుసుకున్న ఊట్కూర్‌ సీహెచ్‌సీ సిబ్బంది గాంధీ నగర్‌ వీధిలోని బాలుడి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబంలో ఇంకా ఎవరికైనా జ్వ రం ఉందా అని తెలుపుకున్నారు.

ఊట్కూర్‌లో బాలుడికి డెంగీ నిర్ధారణ

- అప్రమత్తమైన వైద్య సిబ్బంది

- పరిసరాల్లో దోమల నివారణ మందు పిచికారి

- చుట్టుపక్కల 50 ఇళ్లలో డెంగీ సర్వే

ఊట్కూర్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండల కేంద్రంలోని గాంధీనగర్‌ విధికి చెందిన ఒక బాలుడికి శనివారం డెంగీ వ్యాధి ని ర్దారణ అయ్యింది. విషయం తెలుసుకున్న ఊట్కూర్‌ సీహెచ్‌సీ సిబ్బంది గాంధీ నగర్‌ వీధిలోని బాలుడి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబంలో ఇంకా ఎవరికైనా జ్వ రం ఉందా అని తెలుపుకున్నారు. అనంతరం జిల్లా అధికారులకు సమాచారం ఇ వ్వడంతో జిల్లా నుంచి రాపిడ్‌ రెస్పాన్స్‌ టీం సభ్యుడు శంకర్‌, పర్యవేక్షకుడు చం ద్రశేఖర్‌తో పాటు ఎంపీహెచ్‌ఏవో విజయ్‌కుమార్‌, పర్యవేక్షకుడు నర్సిములు బాలుడి ఇంటికి వెళ్లి పరిసరాలను పరిశీలించి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. అనంతరం మట్టి కుండల్లో ఉన్న నీటిని పారవేయడంతో పాటు చు ట్టుపక్కలపైరెత్రం స్ర్పే చేయించారు. దోమల నివారణ కోసం వీధిలో మందు చ ల్లడంతో పాటు బ్లీచింగ్‌ పౌడర్‌ వేయించారు. అనంతరం వీధిలోని చుట్టు పక్క ల గల 50 ఇళ్లల్లో జ్వర లక్షణాలు ఉన్నవారి రక్తాన్ని సేకరించి డెంగీ నిర్ధారణ ప రీక్షలు చేశారు. అనంతరం వీధిలోని ప్రజలకు అవగాన కల్పిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమలు కుట్టడం వల్లనే మలేరియా, డెంగీ వంటి జ్వరాలు వస్తాయని అన్నారు. అలాగే ప్రతీ శుక్రవారం డ్రైడే - ఫ్రై డే ని ర్వహించడం వల్లదోమల ఉత్పత్తిని అరికట్ట వచ్చని అన్నారు. డాక్టర్‌ సంతోషి, ఎంపీహెచ్‌వో విజయ్‌కుమార్‌, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 11:10 PM