సరిహద్దుల్లో నిఘా
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:30 PM
ఇతర రాష్ట్రాల నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోకి సన్న ధాన్యం రాకుండా అడ్డుకునేందుకు జిల్లా సరిహద్దు ల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
గద్వాల జిల్లాలో ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు
గద్వాల, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోకి సన్న ధాన్యం రాకుండా అడ్డుకునేందుకు జిల్లా సరిహద్దు ల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటికే 81 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇం దులో 80 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నది. దీంతో రైతులు క్వింటాలుకు రూ.2,800లకు పైగా ధరను పొందుతున్నారు. అంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ బోనస్ పథకం లేకపోవడంతో గతేడాది ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని తీసుకువచ్చి తెలంగా ణలోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిం చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై భా రం పడింది. ఈ ఏడాది అలా జరగ కుండా సివిల్ సప్లయ్ అధికారులు మందస్తుగానే జిల్లాలో ఏడు బార్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కర్ణాటక బార్డర్‌లోని చెక్‌పోస్టుల గుండానే గత ఏడాది సన్నధాన్యం జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకొని కర్ణాటక బార్డర్‌లో రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.