వాగులో కొట్టుకుపోయిన బొలెరో
ABN , Publish Date - Oct 30 , 2025 | 10:30 PM
నా గర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలో ని బావాయిపల్లి వాగులో చిక్కుకున్న బొలె రో వాహనాన్ని గ్రామస్థులు జేసీబీ సహా యంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
- ఒడ్డుకు చేర్చిన గ్రామస్థులు
కోడేరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నా గర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలో ని బావాయిపల్లి వాగులో చిక్కుకున్న బొలె రో వాహనాన్ని గ్రామస్థులు జేసీబీ సహా యంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లడంతో ఉధృ తంగా ప్రవహిస్తుండటంతో రవాణా సౌక ర్యం స్తంభించింది. మండల పరిధిలోని బా వాయిపల్లి, పసుపుల, ఖానాపూర్ తదితర వాగులు పొంగి పొర్లడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయి జన జీవనం స్తంభించింది. మండలంలోని పాలమూరు, రంగారెడ్డి ప్రా జెక్టు కట్టపై సీసీ రోడ్డు నిర్మించకపోవడంతో మట్టి రోడ్డు పూర్తిగా అడుగు లోతు గుంత లు పడి వాహనదారులకు పెద్ద వాహనాల కు వెళ్లడానికి రాక రవాణా పూర్తిగా నిలి చిపోయింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వాగులపై బ్రిడ్జిల నిర్మాణం పాలమూ రు-రంగారెడ్డి తీగల పల్లి శివారులో క ట్టపై బీటీ రోడ్డు ని ర్మాణం పూర్తి చేయా లని కోరుతున్నారు.
వరదలో చిక్కుకున్న వారికి సహాయం
ఉప్పునుంతల, (ఆంధ్రజ్యోతి): ఉప్పు నుంతల మండల ప రిధిలోని లత్తీపూర్ గ్రామానికి చెందిన కడారి గణేష్, సువర్ణ దంపతులు డిండి అ లుగు అవతల వైపు గొర్రెల మంద ఏర్పాటు చేసుకొ ని అక్కడే ఉంటున్నారు. మంగళవారం గొర్రెలను మేపి అక్కడే ఉన్నారు. బుధవారం ఎడతెరిపిలేని వర్షంతో డిండి నిం డి ప్రాజెక్టు అలుగుగుండా ప్ర వేశించడంతో గ్రామానికి రాలేక పోయారు. వారికి భోజనం లేక పస్తు లున్నారు. విషయం తెలుసుకున్న అచ్చంపే ట డీఎస్పీ పల్లే శ్రీనివాసులు, సీఐ నాగరాజు, ఎస్‌ఐ వెంకట్ రెడ్డిలు అక్కడకు చేరుకొని తాళ్ల సహాయంతో వారిని సురక్షతంగా తీసుకొచ్చారు.