Share News

బొలెరో, బైక్‌ ఢీ : ఒకరి మృతి

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:43 PM

బొలెరో వాహ నం, బైక్‌ ఎదు రెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి దుర్మర ణం పాలైన ఘటన సోమవారం చోటు చేసుకుంది.

 బొలెరో, బైక్‌ ఢీ : ఒకరి మృతి

చిన్నచింతకుంట, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): బొలెరో వాహ నం, బైక్‌ ఎదు రెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి దుర్మర ణం పాలైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. చిన్నచింతకుంట ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పెద్ద వడ్డెమాన్‌ గ్రామం నుంచి నెల్లికొండి వైపు వెళ్తున్న మదనాపూర్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కాట్రావత్‌ గోపాల్‌కు సం బంధించిన బొలెరో వాహనం, అలాగే చిన్న చింతకుంట మండలం అప్పంపల్లి గ్రామాని కి చెందిన తెలుగు మ ధుకుమార్‌ (35) అనే వ్యక్తి బైక్‌పై వ స్తుండగా ఎదురుగా వస్తున్న క్రమంలో ఢీకొన్నాయి. దీంతో తెలుగు మధుకుమార్‌ కింద పడడంతో తలకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అయితే దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపా రు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.

కుటుంబ సభ్యులు, గ్రామస్థుల ఆందోళన

బొలెరో ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన తెలుగు మధుకుమా ర్‌ భార్య పిల్లలకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యు లు, గ్రామస్థులు సంఘటనా స్థలి వద్ద బైఠాయించారు. దాదాపు రాత్రి 7 గంటల నుంచి 9:30 గంటలు దాటినా మృతదేహం వద్దే రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అయితే ఘటనా స్థలానికి సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తదితరులు వెళ్లి శాంతింపజేసినా నిరసనకారులు తమకు న్యాయం చేయాలంటూ భీష్మించుకుని కూర్చొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 11:43 PM