అన్నిదానాల కన్న.. రక్తదానం గొప్పది
ABN , Publish Date - May 04 , 2025 | 11:12 PM
అన్నిదానాల కన్న రక్తదానం గొప్పదని ఎమ్మెల్యే జీ.మధూసూదన్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి
- ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
దేవరకద్ర, మే 4 (ఆంధ్రజ్యోతి) : అన్నిదానాల కన్న రక్తదానం గొప్పదని ఎమ్మెల్యే జీ.మధూసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా దేవరకద్రలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు మెగా రక్తదానం శిబిరానికి వివిధ మండలాల నుంచి పార్టీ నాయకులు పాల్గొని, రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు బాణ సంచా కాలుస్తూ ర్యాలీగా ఆటపాటలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుల మధ్య ఎమ్మెల్యే సతీమణి కవితతో కలిసి కేక్‌కట్ చేశారు. ఈ సందర్భంగా 398 మంది రక్తదానం చేయగా, వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. మండల అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, అంజిల్‌రెడ్డి పాల్గొన్నారు.
కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
చిన్నచింతకుంట : ఎమ్మెల్యే జీఎంఆర్ జన్మదినం సందర్భంగా ఆదివారం మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో గల కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. అనంతరం కార్యకర్తల సమక్షంలో జీఎంఆర్ దంపతులు కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలు, అభిమానులు తనను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలపటం సంతోషంగా ఉందన్నారు. దమాగ్నాపూర్ గ్రామంలోని తన స్వగృహంలో ఎమ్మెల్యే జీఎంఆర్ తల్లి పదమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. కురుమూర్తి ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈవో మదనేశ్వర్‌రెడ్డి, దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, రంజిత్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, నాయకులు వట్టెం శివకుమార్, శేఖర్, ప్రతాప్ పాల్గొన్నారు.