Share News

కార్పొరేట్‌ రంగానికి అండగా బీజేపీ

ABN , Publish Date - Aug 06 , 2025 | 11:07 PM

కార్పొరేట్‌ రంగా లకు అండగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ విమ ర్శించారు.

కార్పొరేట్‌ రంగానికి అండగా బీజేపీ
మాట్లాడుతున్న ఎండీ జబ్బార్‌

- సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌

మదనాపురం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేట్‌ రంగా లకు అండగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ విమ ర్శించారు. బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో నిర్వహించిన కార్యకర్తల సమావే శంలో ఆయన మాట్లాడారు. పలు రాష్ర్టాలలో ముస్లిం, క్రైస్తవులపై దాడులకి పాల్పడుతూ బీజేపీ సంబర పడుతుందన్నారు. కార్మికుల సం క్షేమాన్ని పక్కకు నెట్టేశారని అన్నారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇచ్చి న హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండ్ల రాజు, వెంకట్రాములు, మణివర్దన్‌, విష్ణు, ప్రసాద్‌, చిరంజీవి, చెన్నయ్య, వెంకటేష్‌, మొగిలి, ఆంజనేయులు, మాసన్న, వెంకటన్న, సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 11:07 PM