Share News

జిల్లాకు నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు రాక

ABN , Publish Date - Jul 25 , 2025 | 10:51 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు శనివారం జిల్లా కేంద్రనికి రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివా్‌సరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాకు నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు రాక

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు శనివారం జిల్లా కేంద్రనికి రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివా్‌సరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు అప్పనపల్లి నుంచి బైక్‌ర్యాలి నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీ మెట్టుగడ్డ, బస్‌స్టాండ్‌, అశోక్‌ టాకీస్‌ చౌరస్తా, వన్‌ టౌన్‌ చౌరస్తా మీదుగా భగీరథకాలనీ కమాన్‌ సమీపంలోని అన్నపూర్ణ గార్డెన్‌ వరకు సాగుతుందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా జిల్లా వస్తున్న రామచంద్రారావుకు ఘన స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, బూత్‌ స్థాయి నాయకులు అఽధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - Jul 25 , 2025 | 10:51 PM