Share News

మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తున్న బీజేపీ

ABN , Publish Date - Jun 26 , 2025 | 11:22 PM

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌ మహిళాసంక్షేమాన్ని విస్మరిస్తోందని కాంగ్రెస్‌ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. మహిళల సంక్షేమాన్ని కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు వసంత ఆధ్వర్యంలో జైబాపు, జైభీమ్‌, జైసంవిధాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తున్న బీజేపీ
ఖాళీ సిలిండర్‌లతో ధర్నా చేస్తున్న మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, మహిళా కార్యకర్తలు

సిలిండర్‌పై రూ.50 పెంచడం దారుణం

స్థానిక ఎన్నికల్లో కాంగ్రె్‌సదే విజయం

మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత

మహబూబ్‌నగర్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌ మహిళాసంక్షేమాన్ని విస్మరిస్తోందని కాంగ్రెస్‌ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. మహిళల సంక్షేమాన్ని కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు వసంత ఆధ్వర్యంలో జైబాపు, జైభీమ్‌, జైసంవిధాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్‌ విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా తెలంగాణ చౌరస్తాకు చేరుకుని ఖాళీ సిలిండర్‌లతో నిరసన చేపట్టారు. సామాన్యుడి నడ్డి విరిచేలా సిలిండర్‌పై రూ.50 పెంచడం దారుణమన్నారు. చివరకు పిల్లలు ఉపయోగించే పెన్సిల్‌, పాలపై కూడా జీఎస్టీ విధించడం దారుణన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని, ధరలను నియంత్రించడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం ఖాయమన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. మహిళా కాంగ్రె్‌సను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని విభాగాలలో కమిటీలను నియమించాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ నాయకురాళ్లు సుకన్య, వెంకటసుబ్బమ్మ, అరుణ, నగర, మండల అధ ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 11:22 PM