కొల్లాపూర్ నల్లమలలో సంచరిస్తున్న పెద్ద పులులు
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:21 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాలో దట్టమైన అడవులకు, లోతైన లోయలకు ప్రసిద్ధిగాంచిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో కొల్లాపూర్ నల్లమలకు ప్రత్యేక స్థానం ఉం ది.
- పెగ్గర్లపెంట అడవిలో 3 పెద్ద పులుల జాడలు గుర్తించిన అటవీ అధికారులు
- సీసీ కెమెరాల నిఘాలో బయటపడ్డ పెద్ద పులుల చిత్రాలు
కొల్లాపూర్ , జూలై25 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో దట్టమైన అడవులకు, లోతైన లోయలకు ప్రసిద్ధిగాంచిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో కొల్లాపూర్ నల్లమలకు ప్రత్యేక స్థానం ఉం ది. పెద్ద పులులు, చిరుతలు, వివిధ జాతుల వన్యప్రా ణులు, పక్షులు వివిధ రకాల జంతువులు ఉన్న విష యం తెలిసిందే. కొల్లాపూర్ మండల పరిధిలోని ముక్కిడిగుండం నుంచి సరిగ్గా 20 కిలో మీటర్ల మేర దట్టమైన నల్లమల ప్రాంతమైన పెగ్గర్ల పెంటలో అట వీ అధికారులు పెద్ద పులులు సంచరించిన జాడలను గుర్తించారు. నల్లమలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమె రాల ఫుటేజీని అటవీ శాఖ అధికారులు పరిశీ లిస్తే.. ఈనెల 16వ తేదీన పెగ్గర్ల పెంట నల్లమ లలో మూడు పెద్ద పులులు సంచరిం చినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారు లు అనుమతి లేనిదే నల్లమలలోకి ఎవరూ వె ళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు మూగజీవాల మేత కోసం దట్టమైన అడవు ల్లోకి ప్రవేశించకుండా బహి రంగ ప్ర దేశాలలోనే వాటికి అందించాలని ఆంక్షలు విధించారు. కొల్లాపూర్ నల్ల మల టైగర్ రిజర్వ్ ఫారె స్టులో ఐదు నుంచి ఏడు పె ద్ద పులు లు సంచ రి స్తున్నా యని, వా టితో పా టు రెండు చిన్న పిల్ల పు లులు కూడా ఉ న్నట్లు వెల్లడిం చారు.
సెప్టెంబర్ వరకు పెద్ద పులులు జతకట్టే సమయం
నల్లమల ప్రాంతంలో కోర్ ఏరియాలో జూలై నుంచి సెప్టెంబర్ ఈ మూడు నెలల పాటు పెద్ద పులులు జత కట్టే కాలం అని అధికారులు తెలుపు తున్నారు. అడవిలో వ ర్షాలు కురిసి చెట్ల గడ్డి వి స్తారంగా పెరగ డంతో ప్రశాంతమైన వాతావరణం లో పెద్ద పులులు, ఇతర వన్య ప్రాణులు జతకట్టి సంతానోత్పత్తి జరుపు తాయి. ఈ సమయంలో అడ వుల్లో జన సంచారం ఉంటే పులుల ఏకాంతానికి భంగం కలిగి సంతానోత్ప త్తిపై ప్రభావం చూపు తుంది. దీనిని దృష్టిలో పె ట్టుకుని అటవీ అధికారు లు పెద్ద పులుల యొక్క అడుగు జాడల ప్రకారం ఎన్ని పులులు ఉన్నాయో అ ని జంతువుల కద లి కలను ఈ నెలలోనే సీసీ కెమెరాల ద్వా రా, దాని యొక్క పా ద ముద్రల ద్వారా గుర్తి స్తున్నారు. పెద్ద పులులు మగ లేక ఆ డవా అని అటవీ అ ధికారులు నిరంత రం నల్లమలలో ప ర్యవేక్షణ కొనసాగిస్తు న్నారు.
ప్రత్యేక నిఘా ఉంచాం
జూలై నుంచి సెప్టెంబర్ వరకు దట్టమైన అడవుల్లో పెద్ద పులులు, వన్య ప్రాణులు, వివిధ రకాల జీవాలు సంతానోత్పత్తి చేసే కాలంగా పరిగణించి నల్లమలలోకి ఎవరిని వెళ్లకుండా ఆంక్షలు విధించాం. జిల్లా అటవీ శాఖ అధికారి డీఎఫ్‌వో రోహిత్ గోపిడి ఆదేశానుసారం హెచ్చరికలు జారీ చేశాం. నల్లమలలో అక్రమ కలప రవాణా జరగకుండా అటవీ శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం.
-ఎండీ ముజీబ్ గోరి, ఫారెస్టు సెక్షన్ అధికారి