భూ వివాదాల పరిష్కారం కోసమే భూ భారతి
ABN , Publish Date - May 12 , 2025 | 11:25 PM
రైతులు తమ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవాలని గద్వాల ఆర్డీవో శ్రీనివాసరావు అన్నారు.
- గద్వాల ఆర్డీవో శ్రీనివాసరావు
ఇటిక్యాల మే 12 (ఆంధ్రజ్యోతి): రైతులు తమ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవాలని గద్వాల ఆర్డీవో శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మండలంలోని ఉదండాపురంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సుకు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. భూ సమస్యలను ఈ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవచ్చని, అధికారులు గ్రామాలకే వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. భూ రికార్డుల సవరణ, విస్తీర్ణ మార్పులు, వారసత్వ సంబంధ సమస్యలు, నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలు, సాదా బైనామాలు, సర్వేనంబర్ గల్లంతు, పాస్‌బుక్కులు రాకపోవ డం వంటి సమస్యలను రైతులు పరిష్కరించు కోవాలని చెప్పారు. సదస్సులో రైతుల నుంచి వి విధ సమస్యలపై 41 దరఖాస్తులు అందాయని తహసీల్దార్ వీరభద్రప్ప తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నందిని, ఎర్రవల్లి త హసీల్దార్ నరేశ్, సీనియర్ అసిస్టెంట్ మనోహర్, ఆర్‌ఐ మధుమోహన్, సిబ్బంది ఉన్నారు.