Share News

సమస్యల పరిష్కారానికే భూ భారతి : ఆర్డీవో

ABN , Publish Date - May 14 , 2025 | 10:58 PM

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాని భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికే ప్రభుత్వం భూభారతి పథకాన్ని అమ లు చేయనున్నట్లు గద్వాల ఆర్డీవో శ్రీనివాసరావు అన్నారు.

సమస్యల పరిష్కారానికే భూ భారతి : ఆర్డీవో

ఇటిక్యాల మే 14 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాని భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికే ప్రభుత్వం భూభారతి పథకాన్ని అమ లు చేయనున్నట్లు గద్వాల ఆర్డీవో శ్రీనివాసరావు అన్నారు. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా బుధవా రం ఇటిక్యాల మండలం చాగాపురంలో రైతు వే దిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సుకు హాజరై గ్రామస్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. గతంలో సాదాబైనామాలతో పొలాన్ని కొనుగోలు చేసి ఉన్న వాటిని సైతం పరిశీలించి చట్టబద్ధత కల్పించడానికి ప్రభుత్వం చట్టాన్ని తెచ్చిందన్నారు. రైతు లు సమస్యలు ఉంటే అధికారులకు నేరుగా ఫి ర్యాదు చేయాలని చెప్పారు. ఈసందర్భంగా ప లువురు గ్రామస్థులు నేరుగా ఆర్డీవోకు ఫిర్యాదులు ఇచ్చారు. సాదాబైనామా, ఓఆర్‌సీ, ఇతర సమస్యలపై రైతులు ఫిర్యాదు చేశారని తహసీ ల్దార్‌ వీరబద్రప్ప తెలిపారు. కార్యక్రమంలో ఎర్రవల్లి తహసీల్దార్‌ నరేశ్‌, ఉపతహసీల్దార్‌ నందిని, సీనియర్‌ అసిస్టెంట్‌ మనోహర్‌, రెవె న్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 10:58 PM