Share News

దేశంలోనే రోల్‌ మోడల్‌గా భూ భారతి

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:25 PM

రాష్ట్రంలో అమలు చేస్తున్న భూ భారతి చట్టం దేశంలోనే రోల్‌ మోడల్‌గా నిలువనుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి అన్నారు.

  దేశంలోనే రోల్‌ మోడల్‌గా భూ భారతి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

- 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఈ చట్టాన్ని తెచ్చాం

- త్వరలో వీఆర్‌వోలు, వీఆర్‌ఏలను నియమిస్తాం

- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

- భూ భారతి అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి జూపల్లి, ఎంపీ మల్లురవి, చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రాజేశ్‌ రెడ్డి

వనపర్తి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అమలు చేస్తున్న భూ భారతి చట్టం దేశంలోనే రోల్‌ మోడల్‌గా నిలువనుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పా టు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సు కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభు త్వం తీసుకొచ్చిన ధరణితో భూ సమస్యలు పరిష్కా రం కాకపోగా రైతులు నరకం అనుభవించారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ ఏది చెబితే అదే చట్టంగా ఉండేదని అన్నారు. దొర గారు ధరణి పథకాన్ని భూ స్వాముల కోసం తెచ్చి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. భూ భార తి చట్టం అలా కాకుండా పకడ్బందీగా పేదోడికి న్యా యం జరిగేలా రూపొందించినట్లు తెలిపారు. ఈ భూ భారతి చట్టం ద్వారా తహసీల్దార్‌, ఆర్డీవో , అ డిషనల్‌ కలెక్టర్‌, కలెక్టర్‌, సీసీఎల్‌ ఇలా వివిధ స్థా యిల్లో భూ సమస్యలు పరిస్కారం అవుతాయని అ న్నారు. ఆయా స్థాయిలో పరిష్కారం కాకపోతే స్పె షల్‌ ట్రిబ్యునల్‌ ప్రవేశ పెట్టడానికి చట్టంలో వెసు లుబాటు కల్పించినట్లు తెలిపారు. రెవెన్యూ అ ధికారులు ఉద్దేశపూర్వ కంగా తప్పులు చేస్తే ఈ చట్టం ద్వారా సద రు అధికారిపై చర్యలు తీసుకోవడానికి వీలుంటుం దన్నారు. ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో ధరణి చట్టం ద్వారా ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు వేల భూములను వెనకేసుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో పొంగులేటి శ్రీని వాస్‌ రెడ్డి అధ్యయనం చేసి ఈ చట్టాన్ని రూపొం దించారని, ఇది రైతుల చుట్టమన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ... భూములంటేనే ఇందిరమ్మ రాజ్యం గుర్తుకు వస్తుందని, నాడు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పేదలకు భూమి పంచి పట్టాలిచ్చిందన్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ... ఒక్క రోజు బయ టికి రాకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాల తీశాడని మండిపడ్డారు. నాలుగు కోట్ల ధనాన్ని న లుగురు దోచుకున్నారని విమర్శించారు. ధరణి పే రుతో రైతులను నానా ఇబ్బందులకు గురి చేశారని వారికి తగిన పాఠం చెప్పారని అన్నారు. ఎమ్మెల్యే లు మేఘారెడ్డి, రాజేశ్‌ రెడ్డి మాట్లాడుతూ... ధరణి చట్టంతో రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్న మన మాజీ నాయకుడు ఆ చట్టంలో ఉన్న లొసుగులతో పట్టాలు చేయించుకు న్నారని మండిపడ్డారు. అందుకే ఆ నాయకుడికి ని యోజకవర్గ ప్రజలు తగిన బుద్ది చెప్పారని విమ ర్శించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో రూ.200 కోట్లకు సంబంధించిన పలు అభివృ ద్ధి పనులను వారు ప్రారంభించారు. స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివ సేనారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధ న్‌ రెడ్డితదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 11:25 PM