ఘనంగా భగీరథ మహర్షి జయంతి
ABN , Publish Date - May 04 , 2025 | 10:43 PM
భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు.
నారాయణపేటటౌన్, మే 4 (ఆంధ్రజ్యోతి): భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి చిత్రపటానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ హితం కోసం ఆనాడు భగీరథుడు అవిశ్రాంతంగా కృషి చేసి నేటి సమాజా నికి కూడా ఆదర్శ ప్రాయుడయ్యారని కొనియాడారు. మహానీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు వీలుగా తెలం గాణ ప్రభుత్వం వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. కార్యక్ర మంలో బీసీ అభివృద్ధి శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్‌వో ఎంఏ.రషీద్, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, సంఘం నాయకులు పాల్గొన్నారు.