Share News

దీక్ష, సహనానికి ప్రతిరూపం భగీరథ మహర్షి

ABN , Publish Date - May 04 , 2025 | 11:11 PM

భగీరథ మహార్షి మహాజ్ఞాని. పరోపకారానికి పెట్టింది పేరు.. దీక్షకు, సహనానికి ప్రతిరూపమని బీసీ సమాజ్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు యం.శ్రీనివాస్‌ అన్నారు.

దీక్ష, సహనానికి ప్రతిరూపం భగీరథ మహర్షి
మహర్షి నివాళి అర్పిస్తున్న బీసీ సమాజ్‌ ప్రతినిధులు

పాలమూరు, మే 4 (ఆంధ్రజ్యోతి) : భగీరథ మహార్షి మహాజ్ఞాని. పరోపకారానికి పెట్టింది పేరు.. దీక్షకు, సహనానికి ప్రతిరూపమని బీసీ సమాజ్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు యం.శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం భగీరథ మహార్షి జయంతి సందర్భంగా బీసీ సమాజ్‌ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎంత కష్టమొచ్చినా లెక్క చేయకుండా అనుకున్నది సాధించేంత వరకు అలుపెరుగని పోరాటం చేసి దివి నుంచి గంగను భూమికి తీసుకొచ్చాడని ఆయన కొనియాడారు. సగర భగీరథుడు ఎంతో సహనంతో కష్టించి పనిచేసే వాడని గుర్తుచేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం సారంగం లక్ష్మికాంత్‌, కుమ్మరి సంఘం బుగ్గన్న, ఆశన్న, నాయీ బ్రాహ్మణ సంఘం అశ్విని సత్యం, సత్యనారాయణ, బి.శేఖర్‌, ఆంజనేయులు పాల్గొన్నారు. మాట్లాడారు.

Updated Date - May 04 , 2025 | 11:11 PM