మెరుగైన వైద్యం అందించాలి
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:31 PM
గద్వాల జిల్లా ప్రభుత్వ ఆ సుపత్రిలో గురువారం రాత్రి ఎర్రవల్లి మం డల పరిధిలోని ధర్మవరం బీసీ ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్ధులు ఆస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శనివారం విద్యార్థు లను పరామర్శించారు.
- అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యేలు, నాయకులు
గద్వాల న్యూటౌన్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లా ప్రభుత్వ ఆ సుపత్రిలో గురువారం రాత్రి ఎర్రవల్లి మం డల పరిధిలోని ధర్మవరం బీసీ ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్ధులు ఆస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శనివారం విద్యార్థు లను పరామర్శించారు. వారికి ధైర్యాన్ని చె ప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇంది రతో విద్యార్థుల ఆరోగ్య విషయాలను తె లుసుకొని వారికి మెరుగైన వైద్యం అం దించేలా చూడాలన్నారు. అనంతరం ఆయ న విలేకర్లతో మాట్లాడుతూ.... ప్రభుత్వ వసతి గృహంలోని విద్యార్థులు 52 మంది అస్వ స్ధతకు గురికావడం బాధాకరమన్నారు. రా త్రి వైద్యులు వెంటనే స్పందించి ఆ విద్యార్థులకు ఎలాంటి ప్రాణహాని లేకుండా వైద్యం అందించారన్నారు. కలెక్టర్, ఉన్నతాధికారు లు స్పందించి సంఘటనకు గల కారణాల ను తెలుసుకొని, వాటిని పరిష్కరించి భవిష్యత్తులో ఇలాంటివి మరోసారి జరగకుం డా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థులకు పరామర్శలు
ఫుడ్‌పాయిజన్ అయిన సంఘటనలో శ నివారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య విషయంపై వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యచికిత్సలు అందించి వారు త్వరగా కోలుకునేలా చూడాలని జి ల్లా ఆసుపత్రి సూపరింటెండ్ ఇందిరకు సూచించారు. అనంతరం చికిత్స పొందుతు న్న ఒక్కొక్క విద్యార్ధి దగ్గరకు వెళ్లి వారికి ధై ర్యం చెప్పారు. అదనపు కలెక్టర్ నర్సింగరావు, బీఆర్‌ఎస్ నాయకుడు గోపాల్ తదితరులు ఉన్నారు. అలాగే, విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆబ్రహాం అన్నారు. శనివా రం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థుల ఆరోగ్య విషయంపై ఆరా తీశారు. ఇందుకు కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వసతిగృహ విద్యార్థులను బీజేపీ నాయకురాలు డి.కె.స్నిగ్ధారెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య విషయంపై వైద్యులతో ఆరాతీసి వా రికి మెరుగైన వైద్యం అందించేలా చూడాల ని ఆసుపత్రి వర్గాలను కోరారు. ఆమె వెంట బీజేపీ నాయకులు రామాంజనేయులు, మీ ర్జాపురంవెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు, సా యి, సతీష్, రాజు తదితరులు ఉన్నారు.