గతం కంటే మెరుగు
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:51 AM
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం/నారాయణపేట, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా గతం కంటే మెరుగుపడింది. గత నెలలో జరిగిన ఇంటర్ ప్రఽథమ, ద్వితీయ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు గతం కంటే మంచి ఫలి తాలు సాధించారు. మొదటి ఏడాదికి సంబంధించి మొత్తం 5315 మంది విద్యా ర్థులు పరీక్ష రాయగా 3368 మంది పాస్ అయ్యారు. బాలుర కంటే బాలికలు పై చేయి సాఽధించారు. ద్వితీయంలో మొత్తం 2944 మంది విద్యార్థులు పరీక్ష రాయ గా 1469 మంది పాస్ అయ్యారు. ఇందులోనూ బాలికలే పైచేయి సాధించారు.
- నారాయణపేట జిల్లాలో ఫస్ట్ ఇయర్‌లో 2283 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1318 మంది పాసై 57.73 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 1316 మంది పరీక్షలు రాయగా 652 మంది పాసై 49.54 శాతం ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్‌లో ఫస్ట్ ఇయర్‌లో 125 మంది పరీక్షలు రాయగా 98 మంది పాసై 78.4 శాతం ఉత్తీర్ణత్త సాధించారు. సెకండియర్‌లో 63 మందికి 40 మంది విద్యార్థులు పాస్ కాగా, 63.49 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే, రీకౌంటింగ్‌కు ఫీజ్ రూ.100, రీ వెరిఫికేషన్‌కు రూ.600 ఆన్‌లైన్ ద్వారా బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియట్‌కు ఈనెల 17 నుంచి 23 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా నోడల్ అధికారి సుదర్శన్‌రావు తెలిపారు.