Share News

పేటకు ఉత్తమ ప్రగతి అవార్డు

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:50 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణంలో రాష్ట్ర స్థాయిలో సెప్టెంబరు నెలకు సంబంధించి ఉత్తమ ప్రగతి అవార్డు నారాయణపేట జిల్లాకు దక్కింది.

 పేటకు ఉత్తమ ప్రగతి అవార్డు
హౌసింగ్‌ పీడీ శంకర్‌ను సత్కరించి ప్రశంసా పత్రం అందిస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, అడిషనల్‌ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రథమ స్థానం

- రాష్ట్ర హౌసింగ్‌ ఎండీ గౌతమ్‌ నుంచి ప్రశంస

నారాయణపేట, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణంలో రాష్ట్ర స్థాయిలో సెప్టెంబరు నెలకు సంబంధించి ఉత్తమ ప్రగతి అవార్డు నారాయణపేట జిల్లాకు దక్కింది. ప్రథమ స్థానంలో నారాయణ పేట, ద్వితీయ స్థానంలో నల్గొండ, తృతీయ స్థానంలో సిద్దిపేట జిల్లాలు నిలిచాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తుండ డంతో గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో హౌసింగ్‌ సిబ్బందితో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ సమావేశమై అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, అడిషనల్‌ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌లు మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఉత్తమ ప్రగతి సాధి స్తుండడంతో బెస్ట్‌ ఫర్పార్మెన్స్‌ ప్రదర్శించిందని రాష్ట హౌసింగ్‌ ఎండీ గౌతమ్‌ ప్రశంసించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతికి కృషి చేసిన హౌసింగ్‌ సిబ్బందిని అభినందిస్తూ హౌసింగ్‌ పీడీ శంకర్‌ను శాలువాతో పాటు ప్రశంసా పత్రంను కలెక్టర్‌, అడిషన్‌ కలెక్టర్‌లు అందించి సత్కరించారు.

జిల్లాలో 4544 ఇళ్ల పనులు ప్రగతిలో..

జిల్లా వ్యాప్తంగా 6182 ఇందిరమ్మ ఇళ్లకు గాను 4544 ఇళ్ల పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇందులో 2782 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవల్‌లో ఉండగా, 619 ఇళ్లు గోడ లెవల్‌లో, 269 స్లాబ్‌ లెవల్‌లో ఉన్నాయి. అయితే, 2630 ఇళ్లకు లక్షరూపాయల బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో చెల్లింపులు జరి గాయి. 519 ఇళ్లు గోడ లెవల్‌ వరకు రెండు లక్షల బిల్లులు చెల్లింపులు, 219 ఇళ్లు స్లాబ్‌లెవల్‌ వరకు బిల్లులు ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది.

Updated Date - Oct 16 , 2025 | 11:50 PM