జిల్లాలో విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు
ABN , Publish Date - May 31 , 2025 | 11:16 PM
పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా కాదని, రా ష్ట్రానికి వెన్నెముక జిల్లాగా మారిందని ఎన్‌ఎస్ యూఐ జిల్లా నాయకుడు శ్రీకాంత్ అన్నారు.
వనపర్తి టౌన్, మే 31 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా కాదని, రా ష్ట్రానికి వెన్నెముక జిల్లాగా మారిందని ఎన్‌ఎస్ యూఐ జిల్లా నాయకుడు శ్రీకాంత్ అన్నారు. శ నివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యా లయంలో విలేకరులతో మాట్లాడారు. పాలమూ రు జిల్లాలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్‌ను పాలమూరులో ఏర్పాటు చేయడం కాంగ్రెస్ ప్ర భుత్వం సాధించిన ఘనత అన్నారు. తెలంగాణ విద్యార్థుల తరఫున, పాలమూరు జిల్లాలోని వి ద్యార్థుల తరఫున సీఎం రేవంత్‌రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నా రు. రాష్ట్రంలో అహంకార పాలన వీడి ప్రజలు.. ప్రజా పాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రీకా రం చుట్టినప్పటి నుంచి విద్యార్థులకు మంచి భ విష్యత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం బాటలు వేస్తుం దన్నారు. రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ టీజీ పీఎస్‌సీ విడుదల చేసిందని, ఈ జాబితా గ్రూ ప్ 1 మెయిన్స్ పరీక్షల ఫలితాల ఆధారంగా రూపొందించబడిందని అన్నారు. 563 ఖాళీల ను భర్తీ చేయడానికి నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారని, అంతే కాకుండా గ్రూప్ 2, 3, 4 వంటి పోటీ పరీక్షలు కూడా పటిష్ట బం దోబస్తుతో సజావుగా జరిపించిన ఘనత కేవ లం కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. అలాంటి తరుణంలో పాలమూరు జిల్లాకు ఐఐటీ క్యాంప స్ రావడంతో చాలా మంది ఉన్నత చదువులు చదువుకునే వీలు ఉంటుందని, విద్యార్థులు ఆ నందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎన్‌ఎస్ యూ నాయకులు గంధం కుమార్, అనిల్, శ రత్, అశోక్, ఆఫాక్ తదితరులు పాల్గొన్నారు.