బీచుపల్లి అంజన్నకు దాసంగాలు
ABN , Publish Date - May 24 , 2025 | 11:26 PM
నడిగడ్డ ఇలవెల్పు దైవమైన బీచుపల్లి ఆంజనేయస్వామి జాతర మహోత్సవ సందర్బంగా శనివారం భక్తుల సందడి నెలకొంది.

- బీచుపల్లిలో భక్తుల సందడి
ఎర్రవల్లి, మే 24 (ఆంధ్రజ్యోతి): పవిత్రపుణ్యక్షేత్రమైన నడిగడ్డ ఇలవెల్పు దైవమైన బీచుపల్లి ఆంజనేయస్వామి జాతర మహోత్సవ సందర్బంగా శనివారం భక్తుల సందడి నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై శుక్రవారం దైవ సన్నిధిలో బస చేసి తెల్లవారుజాము నుంచే కృష్ణానదిలో పుణ్య స్నానాలచరించి దాసంగ నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అలయంలోని భక్తులు క్యూలైన్లో వేచి ఉండి ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏర్పాట్లను ఆలయ ఈవో రామన్‌గౌడ్ పరీశీలించారు.