Share News

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 29 , 2025 | 11:08 PM

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచిం చారు.

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సీజనల్‌ వ్యాధుల పట్ల ముందస్తు జాగ్రత్తలపై వైద్యాశాఖ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

నారాయణపేటటౌన్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచిం చారు. ఈసారి ముందస్తుగానే వర్షాలు కురుస్తుండటంతో వ్యాధు లు ప్రబలే అవకాశం ఉందన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణకు వైద్యశాఖ అధికారులు, సిబ్బంది ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, పైలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా అన్నిరకాల చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు పంచాయతీరాజ్‌, వాటర్‌ సప్లై, మునిసిపల్‌, ఎడ్యుకేషన్‌, సాంఘీక సంక్షేమ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. గతేడాది జిల్లాలో నమోదైన డెంగీ కేసుల వివరాలు, నియంత్రణ చర్యలను కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే, శిథిలావస్థకు చేరిన పెద్దపెద్ద భవనాలను కూల్చివేసేందుకు యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. లేకపోతే మునిసిపల్‌ అధికారులే వాటిని కూల్చి వేయించాలన్నారు. దోమ ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అంతకుముందు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జయచంద్ర మోహన్‌ సీజనల్‌ వ్యాధుల గురించి, దోమల వల్ల వచ్చే వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో డీఈవో గోవిందరాజులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శైలజ, డీపీవో భిక్షపతి, డీఎల్‌పీవో సుధాకర్‌, నారాయణపేట, మక్తల్‌, మద్దూర్‌, మునిసిపల్‌ కమిషనర్లు, వైద్యులు పాల్గొన్నారు.

అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలి

అధికారులు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌లో క లెక్టర్‌ అధికారులతో మాట్లాడారు. జిల్లా ఇన్‌ చార్జి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ శుక్రవారం మహబూబ్‌నగర్‌ పర్యటనలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నందున అం దుకు కావల్సిన పూర్తి సమాచారాన్ని అధికారులు తక్షణం అందజేయాలని ఆదేశించారు. వ్యవసాయ ప్రణాళిక, ధాన్యం కొనుగోలు, భూభారతి రైతు సదస్సులు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువ వికాసం తదితర అంశాలపై కలెక్టర్‌ దిశా నిర్దేశం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:08 PM