ఎరువులు, విత్తనాల కొనుగోళ్లలో జాగ్రత్త
ABN , Publish Date - Mar 15 , 2025 | 11:07 PM
రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రి న్సిపల్ సీనియర్ సివిల్ న్యాయా ధికారి లక్ష్మి సూచించారు.
- ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయాధికారి లక్ష్మి
గద్వాల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రి న్సిపల్ సీనియర్ సివిల్ న్యాయా ధికారి లక్ష్మి సూచించారు. శనివారం మండలం లోని సంగాలలో వినియోగదారుల హక్కుల ది నోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయాధికారి మాట్లాడుతూ.. రైతు లు తమ హక్కులను రక్షించుకోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలులో వ్యాపారి నుంచి తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని సూచించారు. మీకు నష్టం వాటి ల్లినప్పుడు వినియోగదారుల ఫోరం ద్వారా న్యా యం పొందవచ్చని వివరించారు. ఈ సంద ర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర ఉన్నదా? లేదా అని తెలుసుకున్నారు. ఎరువులు, విత్తనా లు, వ్యవసాయ సామగ్రి కొనుగోలులో అధిక ధరలు నియంత్రించబడుతున్నాయా అని తెలుసుకున్నారు. ప్రకృతి వైఫరీత్యాల వలన నష్టం వాటిల్లితో బీమా ద్వారా పరిహారం పొందవచ్చ ని, రైతులు పంటల బీమా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇందుజ, శ్యామల, శ్రీనివాసులు, వెంకటేశ్‌గౌడ్ పాల్గొన్నారు.