Share News

బీసీలకు రాజకీయంగా న్యాయం చేయాలి

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:45 PM

దశా బ్దాల తరబడి రాజకీయంగా బీసీలను వివక్షకు గురిచేసిన పాలకులు ఇప్పటికైనా తగిన న్యా యం చేసి తమ నిబద్ధతను నిరూపించుకోవాల ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ కోరారు.

బీసీలకు రాజకీయంగా న్యాయం చేయాలి
మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ

  • రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ

  • రిజర్వేషన్ల పెంపు కోసం ధర్నా

  • పాల్గొన్న బీసీ కులాలు, ప్రజా సంఘాల నాయకులు

గద్వాలటౌన్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): దశా బ్దాల తరబడి రాజకీయంగా బీసీలను వివక్షకు గురిచేసిన పాలకులు ఇప్పటికైనా తగిన న్యా యం చేసి తమ నిబద్ధతను నిరూపించుకోవాల ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ కోరారు. రాష్ట్రంలో 42శాతం బీ సీలకు రిజర్వేషన్‌ కల్పిస్తూ ఆర్డినెన్స్‌ జారీచేసిన ప్రభుత్వం దాని చట్టబద్ధ అమలు కోసం తగిన కృషి చేయాలన్నారు. అదే సమయంలో చట్టం అమలుకు మోకాలు అడ్డకుండా బీజేపీ నాయ కులు సహకరించాలన్నారు. బీసీలకు రిజర్వేష న్‌ అమలు కోరుతూ ప్రజాసంఘాలు, పార్టీలు, బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని పాతబస్టాండ్‌ సర్కిల్‌లో ధర్నా ని ర్వహించారు. శిబిరంలో మాట్లాడిన ఎర్రసత్యనా రాయణ, రిజర్వేషన్లు పెంచుతూ వెంటనే పార్ల మెంట్‌ ఆమోదం తెలపాలన్నారు. ధర్నాలో బీ ఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, ఇతర ప్రజా సంఘాల నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాము లు, కురువ పల్లయ్య, గోపాల్‌రావు, నరసింహ, వెంకటస్వామి, అతిక్‌ఉర్‌ రెహమాన్‌, మధుసూ దన్‌బాబు, వాల్మీకి, వినోద్‌కుమార్‌, హుస్సేన్‌, ఇ క్బాల్‌పాషా, ప్రభాకర్‌, సుభాన్‌, రాంబాబు, అ చ్చన్నగౌడ్‌, రెహ్మతుల్లా, ఆటో మక్బూల్‌, ఏసురా జు, మణికుమార్‌, సీసల వెంకట్‌రెడ్డి, మోహన్‌ రావు, స్వేరో కృష్ణారెడ్డి, గట్టు నరసింహ, ఉప్పే రు నరసింహ, రేవతి, బాసుశ్యామల, గంజిపేట రాజు, హలీంపాషా, అహ్మద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 11:45 PM