Share News

రిజర్వేషన్‌ డ్రామాతో బీసీలకు మోసం

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:25 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ శా తాన్ని పెంచుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవో పచ్చి బూటకమని బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆరోపించారు.

రిజర్వేషన్‌ డ్రామాతో బీసీలకు మోసం
మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు

గద్వాల టౌన్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ శా తాన్ని పెంచుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవో పచ్చి బూటకమని బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆరోపించారు. రాష్ట్రంలో ని బీసీలను మభ్యపెడుతూ, మరోవైపు తన ప దవిని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నం మరోసారి బహిర్గత మైందన్నారు. జీవో నెం.9 పై హైకోర్టు మధ్యం తర స్టే ఇచ్చిన నేపథ్యంలో గురువారం పట్ట ణంలోని డీకే బంగ్లాలో బీజేపీ నాయకులు విలే కరులతో మాట్లాడారు. చట్టపరంగా ఉన్న నిబం ధనల మేరకు జీవో చెల్లుబాటు కాదన్న సత్యం తెలిసి కూడా ముఖ్యమంత్రి ఎన్నికల నిర్ణయం తీసుకోవడం బీసీలను మోసగించడమేనన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ ప్రభుత్వాని కి తగిన గుణపాఠం నేర్పేందుకు ప్రజలు సిద్ధం గా ఉండాలని పిలుపునిచ్చారు.సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు బండ ల వెంకట్రాములు, జిల్లా మాజీ అధ్యక్షుడు రా మచంద్రారెడ్డి, స్థానిక ఎన్నికల ఇన్‌చార్జి బలిగెర శివారెడ్డి, పట్టణ అధ్యక్షురాలు జయశ్రీ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దేవాదాసు ఉన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 11:25 PM