Share News

బీసీ రిజర్వేషన్లు చరిత్రాత్మకం

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:29 PM

బీసీలకు ఎన్నికలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రేవంత్‌రెడ్డి సర్కార్‌ చిత్తశుద్ధితో పని చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి అన్నారు.

బీసీ  రిజర్వేషన్లు చరిత్రాత్మకం
పాలమూరులో నిర్వహించిన సంబురాల్లో పాల్గొన్న జీఎంఆర్‌

- అసెంబ్లీలో బిల్లు పాస్‌ కావడం అభినందనీయం

- డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్‌

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : బీసీలకు ఎన్నికలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రేవంత్‌రెడ్డి సర్కార్‌ చిత్తశుద్ధితో పని చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పాస్‌ చేయడం చరిత్రాత్మకం అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కులగణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. సోమవారం నగరంలోని న్యూటౌన్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీ సంబురాలు నిర్వహించింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ప్ల కార్డులు ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎంఆర్‌ మాట్లాడారు. బీసీ బిల్లు ఆమోదం పొందడంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈనెల 3న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసాపేటకు వస్తున్నారని తెలిపారు. వేముల శివారులోని ఎస్‌జీడీ ఫార్మా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన రెండో యూనిట్‌ను ప్రారంభించనున్నారని వివరించారు. యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. యూరియా కోసం రైతులెవరూ ఆందోళన చెందవద్దని, అధికారులు ఎప్పటికప్పుడే పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. టీడీపీసీ ఉపాధ్యక్షుడు వేణుగౌడ్‌ మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్‌ అని, కామారెడ్డి డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ ప్రకటించినట్లుగా సీఎం రేవంత్‌ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారన్నారు. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లాకొత్వాల్‌, నాయకులు లక్ష్మణ్‌యాదవ్‌, సంజీవ్‌ముదిరాజ్‌, ఆనంద్‌కుమార్‌గౌడ్‌, రామారావు, బెక్కరి అనిత, ఎన్పీ వెంకటేశ్‌, సిరాజ్‌ఖాద్రి, సీజె బెనహర్‌, అరవింద్‌రెడ్డి, సాయిబాబ, గంజి ఆంజనేయులు, అవేజ్‌, ఫయాజ్‌, అజ్మత్‌అలీ పాల్గొన్నారు.

హెలిప్యాడ్‌ స్థల పరిశీలన

మూసాపేట : మండలంలోని వేముల ఫార్మా కోజెంట్‌ పరిశ్రమ రెండో యూనిట్‌ ప్రారంభించడానికి బుధవారం ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే జీఎంఆర్‌ సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై పరిశీలించి, సమీక్షించారు. పరిశ్రమలో ఉన్న పాత హెలీప్యాడ్‌తో పాటు కొత్తగా కంపెనీ బయటి ఆవరణలో అనుకూలంగా ఉండే స్థలాన్ని పరిశీలించారు. భూత్పూర్‌ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐలు వేణు, శ్రీనివాస్‌, నాగన్న, కాంగ్రెస్‌ అధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్‌, నాగిరెడ్డి, టీపీసీసీ అర్గనైజింగ్‌ కార్యదర్శి అరవింద్‌కుమార్‌రెడ్డి, నాయకులు లక్ష్మికాంత్‌రెడ్డి, లక్ష్మినారాయణ, కృష్ణయ్య, సురేష్‌ ఉన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 11:29 PM