తెలంగాణ అంటేనే బతుకమ్మ
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:36 PM
తెలంగాణ అంటేనే బతుకమ్మఅని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎ్‌సయూఐ ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సంప్రదాయాలు ఉట్టిపడేలా సంబురాలు
ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి
ఎన్‌ఎ్‌సయూఐ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో వేడుకలు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అంటేనే బతుకమ్మఅని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎ్‌సయూఐ ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సంబురాల్లో పాల్గొని, విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదివారం నుంచి రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలను అంబరాన్ని తాకేలా నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం కళాశాలలో స్కిల్ డెవల్‌పమెంట్ నైపుణ్య శిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎన్‌పీ వెంకటేష్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు రమేష్, శివ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.