Share News

మన సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ

ABN , Publish Date - Oct 01 , 2025 | 10:54 PM

బతుకమ్మ పండుగలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడుతాయని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.

మన సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ
శేకుపల్లి గ్రామంలో బతుకమ్మ ఆడుతున్న అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు

ఎర్రవల్లి, అక్టోబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ పండుగలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడుతాయని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఎర్రవల్లి మండలంలోని శేకుపల్లి గ్రామంలో బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అయన పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ వేడుక ల్లో మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొ నడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. అంతకు ముందు ఎమ్మెల్యే విజ యుడు దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు హనుమంతురెడ్డి, పీఎసీఎస్‌ అధ్యక్షుడు రంగారెడ్డి, మాజీ సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 10:54 PM