పల్లె సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:28 PM
పల్లె సంస్కృతి, భక్తికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్ బ దావత్ సంతోష్ అన్నారు. ఐడీవోసీ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు కలెక్టర్ హాజరై పూజలు చేశారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పల్లె సంస్కృతి, భక్తికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్ బ దావత్ సంతోష్ అన్నారు. ఐడీవోసీ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు కలెక్టర్ హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ బతుకమ్మ పండుగ భక్తిశ్ర ద్ధలతోపాటు సామూహిక ఆనందానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. కలెక్టర్ పూజలు పూర్తి చేసిన అనంతరం మహిళలతో కలిసి బొడ్డెమ్మలు వేసి ఆడారు. మహిళలు సంప్రదాయ వే షధారణలో పల్లె పాటలతో వాతావ రణాన్ని రంజింపజేశారు. జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ పి.అమరేందర్, డీఆర్‌డీఏ అ దనపు పీడీ రాజేశ్వరి, జిల్లా సంక్షేమ శాఖ అఽధికారిణి రాజేశ్వరి, జిల్లా మ త్స్యశాఖ అధికారిణి డాక్టర్ రజిని, డీ ఈవో రమే ష్‌కుమార్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, కలెక్టరేట్‌లోని వివిధ శా ఖల మహిళా ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.