బ్యాంకు ఖాతా నిర్వహణ పత్రాలు విధిగా అందజేయాలి
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:36 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేస్తున్న ప్రతీ అభ్యర్థికి విధిగా ఎన్నికల వ్యయముల ఖాతా నిర్వహణ పత్రాలను అందజేయాలని ఎన్నికల అధికారులకు జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు.
కలెక్టర్ బీఎం సంతోష్
మల్దకల్, తాటికుంట గ్రామాల్లో నామినేషన్ కేంద్రాల పరిశీలన
ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశం
మల్దకల్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేస్తున్న ప్రతీ అభ్యర్థికి విధిగా ఎన్నికల వ్యయముల ఖాతా నిర్వహణ పత్రాలను అందజేయాలని ఎన్నికల అధికారులకు జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. సోమవారం మల్దకల్ మండల కేంద్రంతో పాటు తాటికుంట గ్రా మంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆయా గ్రామాల్లో సర్పం చ్, వార్డు స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం సంబందిత అభ్యర్థుల నుంచి నామినేషన్ స్వీకరించాలని ఎన్నికల అధికారులకు సూ చించారు. పోటీ చేయు అభ్యర్థుల నుంచి అవసరమైన ధ్రువపత్రాలను తీసుకుని విధిగా దరఖాస్తులకు జత చేయాలని డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థితో నిర్దేశిత డిపాజిట్ తీసుకుని తగిన రసీదును అందజేయాలన్నారు. నామినేషన్ కేంద్రంలోకి అ భ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతించాలని సూచించారు. అభ్యర్థులు గ్రామ పంచాయ తీకి చెల్లించవలసిన పన్నులు, బకాయి లేకుండా చూడాలని ఎన్నికల నియమావళి ఇతర అంశా లతో ముద్రించిన పత్రాలను అభ్యర్థులకు అంద జేయాలన్నారు. అనంతరం అభ్యర్థులకు సంబంధించిన ఓటరు జాబితాను ఆయన పరిశీలించారు. నామినేషన్ వేసిన అభ్యర్థుల జాబితాను నో టీస్ బోర్డుపై అతికించాలని ఆదేశించారు. సాయంత్రం 5 గంటల తర్వాత నామినేషన్ వేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని, నిర్దేశిత సమయానికి కేంద్రంలో ఉన్న వారి నుం చి మాత్రమే నామినేషన్ పత్రాలు స్వీకరించాల ని సూచించారు. ఈ పర్యటనలో ఆయనతో పా టు మల్దకల్ మండల ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఎంఈవో సురేశ్, అధికారులు పాల్గొన్నారు.