Share News

బందైన రైల్వే ఒకటో ప్లాట్‌ఫాం

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:51 PM

స్థానిక రైల్వే స్టేషన్‌ ఆధునీకీకరణ పనుల్లో భాగంగా ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫాం మీద ఆగాల్సిన రైళ్లను గురువారం నుంచి అందుబాటులో ఉండవని రైల్వే అధికారులు తెలి పారు.

 బందైన రైల్వే ఒకటో ప్లాట్‌ఫాం
స్థానిక రైల్వేస్టేషన్‌లో కొనసాగుతున్న పనులు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వే స్టేషన్‌ ఆధునీకీకరణ పనుల్లో భాగంగా ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫాం మీద ఆగాల్సిన రైళ్లను గురువారం నుంచి అందుబాటులో ఉండవని రైల్వే అధికారులు తెలి పారు. స్టేషన్‌ పురాతన భవనం తొలగింపు, లూప్‌ లైన్ల విస్తరణ పనుల నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైళ్లన్నీ రెండు, మూడో ప్లాట్‌ ఫారాల మీద ఆగనున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులు విషయాన్ని గ్ర హించాలని కోరారు. నూతన భవనం నిర్మాణమయ్యే వరకు రెండు, మూడు ప్లాట్‌ ఫాంలు మాత్రమే అందుబాటులో ఉండటాయని తెలిపారు. మహ బూబ్‌నగర్‌ నుంచి ఉదయం ప్రారంభయయ్యే డెమోతో పాటు, రాజ్‌కోట్‌, విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లు ఒకటో నంబరులో ఆగవు. అలాగే కర్నూల్‌ వైపు వెళ్లే గుంతకల్‌, తిరుపతి, బెంగళూరు, మైసూర్‌, చిత్తూరు, రాయచూర్‌, కోయంబత్తుర్‌, యశ్వంత్‌పూర్‌, మధురై, వాస్కోడిగామా, గుంటూరు, చెన్నై, చెంగల్పట్టు, నాగర్‌కోయల్‌, రామేశ్వరం, కాచిగూడ వైపు నడిచే హజ్రత్‌ నిజాముద్దీన్‌, జైపూర్‌, అమరావతి, ఒకా, లక్నో, కోర్బా, అకోలా రైళ్లన్నీ రెండు, మూడో ప్లాట్‌ ఫారాల పైకి వస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

Updated Date - Dec 11 , 2025 | 11:51 PM