Share News

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:20 PM

బక్రీద్‌ (ఈదుల్‌ జుహా)ను శనివారం ఘనంగా జరుపుకున్నారు.

 భక్తిశ్రద్ధలతో బక్రీద్‌
రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- కిటకిటలాడిన ఈద్గా మైదానాలు

- పండుగ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

మహబూబ్‌నగర్‌అర్బన్‌, జూన్‌ 7 (ఆంరఽధజ్యోతి): బక్రీద్‌ (ఈదుల్‌ జుహా)ను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రం తో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా కేంద్రంలోని వానగుట్ట రహెమానియా ఈద్గాలో వేలాది మంది ముస్లింలు ఈద్‌ నమాజ్‌ చేశారు. జామియా మసీదు ఇమామ్‌ మౌలానా హాఫిజ్‌ ఇస్మాయిల్‌ ఉదయం 9 గంటలకు ప్రత్యేక నమాజ్‌ చేయించారు. బక్రీద్‌ ప్రాశస్త్యాన్ని ఖుత్‌బా రూపంలో వివరించి, పవిత్ర ఖురాన్‌ గ్రంథంలోని సందేశాలతో పాటు ప్రవక్త మహ్మద్‌ అలైహివస ల్లమ్‌ ఆచరించిన ధర్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరుపున ఈద్గా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

పండుగలు ఐక్యతకు ప్రతీకలు: ఎమ్మెల్యే

పండుగలు ఐక్యతకు ప్రతీకలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అ న్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని రహెమానియా ఈద్గాలో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌తో కలిసి పలువురు ప్రజా ప్రతినిధులు ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భం గా మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ త్యా గానికి, సహనానికి ప్రతీక బక్రీద్‌ అన్నారు. భారతీయులంతా ఒక్కటే అ ని పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రపంచానికి చాటామని, మతాల పే రుతో దేశాన్ని విడగొట్టాలనే శత్రు దేశ కుట్రను మన సైనికులు భగ్నం చేశారని ఆయన గుర్తుచేశారు. మహబూబ్‌నగర్‌లో కొన్ని శఽక్తులు కు లమతాల పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని, కానీ ప్రజలు వాటిని తిప్పికొట్టి సోదర భావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని ఎమ్మె ల్యే అన్నారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొ త్వాల్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, కాంగ్రెస్‌ నాయకుడు, జిల్లా ఒలంపిక్‌ సంఘం అ ధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్‌, సం జీవ్‌ ముదిరాజ్‌, మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ షబ్బీర్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, మోసీన్‌ఖాన్‌, రహీం, మునిసిపల్‌ కమిషనర్‌ మ హేశ్వర్‌రెడ్డి, నాయకులు భవగంతరావు, ఆవేజ్‌, అజ్మత్‌అలీ పాల్గొన్నారు.

బందోస్తు ఏర్పాటు చేసిన పోలీస్‌ శాఖ

బక్రిద్‌ సందర్భంగా శనివారం వానగుట్ట ఈద్గాలో నమాజ్‌కు వచ్చే వారికి పోలీస్‌శాఖ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నది. ఎస్పీ జా నకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jun 07 , 2025 | 11:20 PM