Share News

బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి

ABN , Publish Date - Jun 06 , 2025 | 10:59 PM

బడీడు పిల్లలను బడిలో చేర్పించేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అన్నారు.

బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి
కోస్గి జడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

- ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే వారంతా బడిబయటి పిల్లలను గుర్తించాలి

- అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

- కోస్గిలో బడిబాట ప్రారంభం

కోస్గి/నారాయణపేటరూరల్‌/మరికల్‌/ కొత్తపల్లి/మాగనూరు/దామరగిద్ద/కృష్ణ/ ఊట్కూర్‌/ధన్వాడ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): బడీడు పిల్లలను బడిలో చేర్పించేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 470 పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం ప్రారంభ మైంది. అందులో భాగంగా కోస్గి పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారంతా ఉపాధ్యాయులతో పాటు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాల మహిళలు కూడా తమ ప్రాంతాల్లో బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు, విద్యాబోధన, మౌలిక వసతులను వారితో పాటు, తల్లిదండ్రులకు వివరించి, బడిలో చేర్పించాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీధర్‌, కమిషనర్‌ నాగరాజు, ఎంఈవో శంకర్‌నాయక్‌ ఉన్నారు.

అదేవిధంగా, పేట మండలం జాజాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల, పేరపళ్ల పాఠశాలల్లో నిర్వహించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట గ్రా మసభల్లో ఆర్డీవో రాంచందర్‌నాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు, అన్ని సౌకర్యాలు ఉంటాయని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. హెచ్‌ఎం భారతి, పద్మజ, తహసీల్దార్‌ అమరేంద్రకృష్ణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరికల్‌ మండల కేంద్రంతో పాటు, పెద్దచిం తకుంటలో నిర్వహించిన బడిబాటలో ఎంఈవో మనోరంజని మాట్లాడారు. గ్రామ ప్రజా ప్రతిని ధులు, యువకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బడిబాట సమావేశంలో ఎంఈవో ఆంజనేయులు, ఏపీవో రామన్నలు మాట్లాడారు. అనంతరం పదో తరగతి మండల టాపర్‌ శిరీషను గ్రామస్థుల ఆధ్వర్యంలో అధికారులు సన్మానించారు. పంచాయతీ కార్యదర్శి వెంకటేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మాగనూరు మండలం నేరడగం క్లస్టర్‌ కాంప్లెక్స్‌ హెడ్మాస్టర్‌ రాజేష్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ బడి బాట ఆవశ్యకతను తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం పాఠశాలలో గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మండల ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రాజారెడ్డి, బలరాం, రాకేష్‌, కాంగ్రెస్‌ పార్టీ మాగనూరు మండల అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్‌, మాజీ వార్డు మెంబర్‌ దండు ఆనంద్‌, మండలంలోని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొ న్నారు.

దామరగిద్ద మండలం కానుకుర్తి హైస్కూల్‌, జీపీఎస్‌లలో హెచ్‌ఎంలు అన్నపూర్ణ, శేర్‌ కృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో గ్రామ నాయకులు, ఉపాధ్యా యులు, విద్యార్థుల తల్లిదండ్రులతో బడిబాట ర్యాలీ నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని సూ చించారు. ఎంపీటీసీ మాజీ సభ్యులు బస్వరాజ్‌, మొహిన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కృష్ణ మండలం కున్సి గ్రామంలో నిర్వహించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్ర మంలో తహసీల్దార్‌ పాల్గొని, మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శి స్వామినాథ్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాంచందర్‌, మాజీ సర్పంచ్‌ సోమశేఖర్‌గౌడ్‌, మాజీ ఉప సర్పంచ్‌ నల్లే నర్సప్ప, ఉ ాధ్యాయులు నర్సిములు, కాశీం, అలీ, శ్రీనివాసులు, నరేందర్‌, భారతి, సౌమ్య ఉన్నారు.

ఊట్కూర్‌ మండలం చిన్నపొర్ల గ్రామంలో ఉర్దూ మీడియం, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గ్రావ ల్లో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచి తల్లిదండ్రులకు బడిబాటపై అవగాహన కల్పించారు. హెచ్‌ఎం గులాంరసూల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ధన్వాడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బడిబాట గ్రామసభ నిర్వహించారు. సభలో విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను నిలదీ శారు. సర్కార్‌ బడిలో సరిగ్గా మూత్రశాలలు లేవని, విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్స్‌ కొలతలు సరిగ్గా ఉండవని, ఉపాధ్యాయులు కేవలం జీతాలకే పరిమితం అవుతూ విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు. అనంతరం ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. ఎంపీడీవో సాయిప్రకాష్‌, ఎంఈవో గాయత్రి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌రావు, బాలుర పాఠశాల హెచ్‌ఎం నర్సింహ్మచారి తదితరులున్నారు.

Updated Date - Jun 06 , 2025 | 10:59 PM