Share News

ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ను వినియోగించాలి

ABN , Publish Date - May 06 , 2025 | 11:07 PM

జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో, ల్యాబ్‌లలో ఆయుష్మాన్‌ భారత డిజిటల్‌ మిష న్‌ను వినియోగించాలని ఏబీడీఎం మేనేజర్‌ ప్రకాష్‌ అన్నారు.

ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ను వినియోగించాలి
భారత్‌ డిజిటల్‌ మిషన్‌ గురించి వివరిస్తున్న ఏబీడీఎం మేనేజర్‌ ప్రకాష్‌, డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్‌

- ఏబీడీఎం మేనేజర్‌ ప్రకాష్‌

నారాయణపేటటౌన్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో, ల్యాబ్‌లలో ఆయుష్మాన్‌ భారత డిజిటల్‌ మిష న్‌ను వినియోగించాలని ఏబీడీఎం మేనేజర్‌ ప్రకాష్‌ అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆయుష్మాన్‌ భారత డిజిటల్‌ మిషన్‌(ఏబీడీఎం) కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అనంతరం జిల్లా, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.జయచంద్రమోహన్‌ మాట్లాడుతూ ప్రతీ ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను ఆయుష్మాన్‌ భారత యాప్‌లో నమోదు చేయాలన్నారు. దీనివల్ల ఆసుపత్రుల కు, ఫార్మసీకి వచ్చే రోగుల హెల్త్‌ కార్డును లింక్‌ చేస్తే జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా ప్రతీ కార్డుకు రూ.20 చొప్పున ఇన్సెంటివ్‌ పొందవ చ్చని తెలిపారు. రోగుల సంరక్షణకు డిజిటల్‌ ఆరోగ్య సేవలను పొందేందుకు వారి ఆరోగ్య డేటా సంరక్షించుకునేందుకు ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ ఉపయోగపడుతుందని వివరించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.శైలజ, నోడల్‌ అధికారి శ్రీనివాసులు, డీపీవో భిక్షపతి, ఎంపీ హెచ్‌ఈవో గోవిందరాజులు, ప్రైవేటు ఆసపత్రుల ల్యాబ్‌ టెక్నీషియన్లు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:07 PM