Share News

సర్టిఫికెట్‌ కోర్సులపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Oct 30 , 2025 | 10:57 PM

వృతి సంబంధ నైపుణ్యాల పెంపుకోసం సర్టిఫికె ట్‌ కోర్సు పట్ల అవగాహన పెంచుకోవాలని వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రమోహన్‌ సూచిం చారు.

సర్టిఫికెట్‌ కోర్సులపై అవగాహన పెంచుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రమోహన్‌

  • వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రమోహన్‌

గద్వాల టౌన్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): వృతి సంబంధ నైపుణ్యాల పెంపుకోసం సర్టిఫికె ట్‌ కోర్సు పట్ల అవగాహన పెంచుకోవాలని వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రమోహన్‌ సూచిం చారు. తెలంగాణ స్కిల్‌ నాలెడ్జి సెంటర్‌ ఆధ్వ ర్యంలో ఉమిద్‌ ఫౌండేషన్‌ వారు డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థినుల కోసం గురువారం ప ట్టణంలోని ఎంఏల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్‌ కోర్సులకు సంబంధించి ఓరియంటేష న్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బం గా మాట్లాడిన వైస్‌ ప్రిన్సిపాల్‌, లైఫ్‌ స్కిల్స్‌, ఇం టర్వ్యూ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్స్‌ తదితర అంశాలపై సర్టిఫికెట్‌ కోర్సుల ద్వారా అవగాహ న పెంచుకుని నచ్చిన రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో మాట్లాడిన ఉమిద్‌ ఫౌండేషన్‌ రిసోర్స్‌పర్సన్‌ ఈష, ప్రోగ్రాం నెలరో జుల పాటు ఉంటుందన్నారు. నవంబరు 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కోర్సులో వృత్తిప రమైన లక్ష్యాలను సాధించడంతో పాటు వారి కేరీర్‌ మార్గాలను నావిగేట్‌ చేసేందుకు మద్ద తుగా ఉండేందుకు కార్యక్రమాలను రూపొందిం చినట్లు తెలిపారు. విద్యార్థినులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల టీఎస్‌కేసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.సత్తెమ్మ, మెంటార్‌ సుబ్రమణ్యం, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్‌ రాధిక, అధ్యాపకులు సురేందర్‌రెడ్డి, డాక్టర్‌ కె.సత్యన్న, డాక్టర్‌ వెంకటే శ్వరమ్మ, జిటి పద్మ, వినోద్‌, రమాదేవి ఉన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 10:57 PM