మహిళలు, విద్యార్థినుల భద్రతపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Aug 22 , 2025 | 10:54 PM
మహిళలు, విద్యార్థినుల భద్రతపై విస్తృతంగా అవగాహన క ల్పించాలని సీఐడీ ఎస్పీ అనోన్య పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం హైదరాబా ద్ నుంచి పేట జిల్లాకు వచ్చిన ఆయనకు ఎస్పీ యోగే్‌షగౌతమ్ స్వాగతం పలికారు.
నారాయణపేట, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మహిళలు, విద్యార్థినుల భద్రతపై విస్తృతంగా అవగాహన క ల్పించాలని సీఐడీ ఎస్పీ అనోన్య పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం హైదరాబా ద్ నుంచి పేట జిల్లాకు వచ్చిన ఆయనకు ఎస్పీ యోగే్‌షగౌతమ్ స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో షీ టీం పోలీసులు, భరోసా సెంటర్ బృందం, పోలీస్ కళా బృందం, యాంటీ హ్యూమన్ ట్రాఫికిం గ్ టీంలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐడీ ఎస్పీ మాట్లాడుతూ మహిళలపై వేధింపుల ను పూర్తిగా అరికట్టడమే ప్రతీ పోలీసు యొక్క ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో సీఐడీ సీఐ లక్ష్మణ్‌నాయక్, డీసీఆర్‌బీ ఎస్‌ఐ సునీత, ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ కృష్ణంరాజు పాల్గొన్నారు.