చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - May 20 , 2025 | 11:23 PM
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు చట్టాలపై అ వగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయాధికారి వి.శ్రీనివాస్ అన్నారు.
- ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయాధికారి వి.శ్రీనివాస్
గద్వాల, మే 20 (ఆంధ్రజ్యోతి): అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు చట్టాలపై అ వగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయాధికారి వి.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని మదనపల్లిలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యా య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతి థిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అసంఘటితరంగ కార్మికులు అంటే ప్రభుత్వంతో అధికారికంగా నమోదు కాని ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులు అన్నారు. తరుచుగా చట్టపరమైన, నియంత్రణ చట్టానికి వెలుపల పనిచేస్తారని చెప్పారు. ఈ రంగం చిన్నవ్యాపారుల నుం చి మొదలుకొని ఇంటి ఆధారిత పనివరకు విస్తృతశ్రేణి కార్యకలాపాలను కలిగి ఉంటుంద న్నారు. కార్మికులంతా లేబర్‌కార్డు, ఈ-శ్రామ్ కా ర్డు కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రయోజనాలను పొందవచ్చని సూచించారు. చట్టాలపై కనీస అవగాహ నతో ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ రాజేందర్, శ్రీనివాసులు, లక్ష్మణ స్వామి తదితరులు పాల్గొన్నారు.