Share News

పోలింగ్‌ నిర్వహణపై అవగాహన అవసరం

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:10 PM

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిం చే అధికారులు పోలింగ్‌ నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

పోలింగ్‌ నిర్వహణపై అవగాహన అవసరం
శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

  • జోగుళాంబ గద్వాల కలెక్టర్‌ బీఎం సంతోష్‌

  • సిబ్బందికి రెండు కేంద్రాల్లో శిక్షణ

గద్వాల టౌన్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిం చే అధికారులు పోలింగ్‌ నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. జిల్లాలో మొదటి విడత నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ విధుల్లో పాల్గొనే రిటర్నింగ్‌, ప్రిసైడింగ్‌ అధికారులకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని రెండు ప్రభుత్వ ఉ న్నత పాఠశాలల్లో రెండోదశ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రెండు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ పోలింగ్‌ నిర్వహణపై ఎలాంటి సందేహాలు ఉన్నా మాస్టర్‌ ట్రైనర్స్‌ను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. మొదటి విడత ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఆయా మండల్లోని గ్రామాల్లో ఓటు హక్కు కలిగి ఉంటే ఫారం-14 ఇవ్వడం జరుగుతుందన్నారు. దరఖాస్తులను సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో అం దజేసి ఈనెల 8న పోస్టల్‌ బ్యాలెట్‌ పొందవచ్చని అన్నారు. ఇతర జిల్లాల వారు తమ పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తూ ప్రతీ ఓటరు తమ ఓటుహక్కును వినియోగిం చుకునేలా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా శిక్షణకు హాజరైన అధికారుల జాబితాను పరిశీలించిన కలెక్టర్‌, నిర్వాహకులకు పలుసూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట గద్వాల ఎంపీడీవో శైలజ, ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్‌, ఇతర అధికారులు ఉన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 11:10 PM