ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై ఆడిట్
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:08 PM
ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవకలపై డీఆర్‌డీవో మొగులప్ప, సోషల్ ఆడిట్ బీఆర్‌పీఏ రమేశ్ ఆధ్వర్యంలో మంగళవారం మరికల్ ఎంపీడీవో కార్యాలయంలో ఆడిట్ నిర్వహించారు.
మరికల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవకలపై డీఆర్‌డీవో మొగులప్ప, సోషల్ ఆడిట్ బీఆర్‌పీఏ రమేశ్ ఆధ్వర్యంలో మంగళవారం మరికల్ ఎంపీడీవో కార్యాలయంలో ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రా మాల్లో ప్రతీరోజు కొనసాగుతున్న ఉపాఽధి హామీ పథకంలో అనేక అవకతవకలు బయటపడ్డాయన్నారు. తక్కువ పనికి ఎక్కువ బిల్లు చేసి పంపించారని, పనిచేయని వారికి పేమెంట్ ఇవ్వడం, ఒక ఇంట్లో రెండు, మూడు జాబ్ కార్డులు బయటపడ్డాయన్నారు. పదిరోజులు పనిచేస్తే 14 రోజుల పేమెంట్ చేయడం, బాలుడుకి జాబ్‌కార్డు, పల్లె గడ్డ గ్రామంలో ఒకే కుటుంబంలో అన్నదమ్ముళ్ల పిల్లలకు దాదాపు రూ.లక్షా 40 వేలు బిల్లు చేశారని, పనిచేసే వారు ఒకరు బిల్లు తీసుకొనే వారు మరొకరు, చేయని పనికి బిల్లులు వంటి అవకతవకలు చోటు చేసుకున్నాయని వా రు వివరించారు. కన్మనూర్‌లో జరిగిన అవకతవకల డ బ్బులను వెంటనే రికవరీ చేస్తామన్నారు. జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి, డీఆర్‌పీటీ రాఘవులు, ఏఈ పీఆర్ వెంకటేష్, ఎంపీడీవో కొండన్న, ఎంపీవో పావని, ఏపీవో ఉషనప్ప, పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌సుందర్‌రెడ్డి పాల్గొన్నారు.