Share News

వేలం పాటలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:18 PM

ఎన్నికల్లో వేలం పాటలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

వేలం పాటలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం
సమావేశంలో మాట్లాడుతున్న అరుణ

మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో వేలం పాటలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సర్పంచ్‌ ఎన్నికల్లో డబ్బులు అఽధికంగా ఉన్నవారే గెలిచేలా వేలం పాటలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. సర్పంచ్‌లను, వార్డు సభ్యులను ఓటు ద్వారా ఎన్నుకోవాలన్నారు. ప్ర జలను మభ్యపెట్టి, ఎన్నికలు నిర్వహించకుండా, లక్షల రూపాయలకు వేలం పాట పాడి సర్పంచ్‌లుగా ఏకగ్రీవం చేస్తున్నామని చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజలు ఒప్పుకుంటే ఏకగ్రీ వం చేయడం మంచిదేనని, కానీ వేలం నిర్వహించడం సరికాదన్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, జాతీయ కౌన్సిల్‌ సభ్యురాలు పద్మజారెడ్డి, నాయకులు పడాకుల బాలరాజు పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 11:18 PM