బీజేపీ పాలనలో దాడులకు ఆజ్యం
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:50 PM
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడి మత విష సంస్కృతికి పరాకాష్ట అని సీపీ ఐ నియోజకవర్గ కార్యదర్శి రమేశ్ మండిప డ్డారు.
- సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రమేశ్
వనపర్తి టౌన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడి మత విష సంస్కృతికి పరాకాష్ట అని సీపీ ఐ నియోజకవర్గ కార్యదర్శి రమేశ్ మండిప డ్డారు. బుధవారం సాయంత్రం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌర స్తాలో దాడిని నిరసిస్తు న్యాయవాది రాకేశ్ కిశో ర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాడిని తీవ్రంగా పరిగణించి వెంటనే న్యాయవాదిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. సీజే సనాతన ధర్మానికి మద్దతు పలకలేదన్న ఆక్రోశంతో బూటు విసరడం హేయమైన చర్య అని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి ఘటనలు జరగలేదని, బీజేపీ ప్రభు త్వం మతోన్మాదాన్ని పెంచి పోషించడంతోనే ఇలాంటివి జరిగాయన్నారు. బీజేపీ పాలనలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికే భద్రత కరువైందని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ దుశ్చర్యకు బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించి, అసమర్థ పాలనపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపా ధ్యక్షుడు శ్రీరాం, కళావతమ్మ, చిన్న కురుమ య్య, జయమ్మ, వెంకటమ్మ, అఖిల్, జ్యోతి, సు ప్రియ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.