Share News

పోటీ నుంచి తప్పుకోవాలని దాడి?

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:35 PM

నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ తనపై సోమవారం రాత్రి దాడి చేశారని జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని సల్కాపురానికి చెందిన అభ్యర్థి ఆంజనేయులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

పోటీ నుంచి తప్పుకోవాలని దాడి?

  • పోలీసులను ఆశ్రయించిన అభ్యర్థి

గట్టు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మొ దటి విడత సర్పంచ్‌ ఎన్నికల కోసం వేసి న నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ తనపై సోమవారం రాత్రి దాడి చేశారని జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని సల్కాపురానికి చెందిన అభ్యర్థి ఆంజనేయులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆయన నామినేషన్‌ వేయడంతో పాటు 22 హామీలు ఇస్తూ గ్రామ ఓ టర్లకు బాండ్‌ పేపర్‌ విడుదల చేశాడు. ఈ విషయం సోషల్‌ మీడియాతోపాటు, ఎలక్ర్టానిక్‌, ప్రింట్‌ మీడియాలో ప్రచురి తమవడం తో చర్చనీయాంశంగా మారింది. దీంతో కోపోద్రిక్తులైన పలువురు గ్రామస్థులు రాత్రి సమయంలో తనపై దాడికి పాల్పడ్డార ని, నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకోవాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. తన ను హత్య చేసేందుకు ప్రయత్నించారని సకాలంలో ఎస్‌ఐ కేటీ మల్లేశ్‌ రావడం వల్ల ప్రమాదం తప్పిందని చెప్పారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఎస్‌ఐని సంప్రదించగా తాను అక్కడే ఉండి పర్యవేక్షణ చేశానని, హత్యా యత్నం ఏమీ జరగలేదన్నారు. నామినేషన్‌ విత్‌ డ్రా చేయించేందుకు ఎవరైనా ఒత్తిడి తెస్తే పోలీసు స్టేషన్‌కు రావాలని చెప్పానని అన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:35 PM