కేటీదొడ్డి ఎస్సై ఏఆర్‌కు అటాచ్
ABN , Publish Date - Oct 29 , 2025 | 10:47 PM
మండలంలో ని వెంకటాపురంలో జరిగిన పాగుంట లక్ష్మీ వేంకటేశ్వ ర స్వామి జాతరలో పోలీసు అధికారులు డబ్బులు వ సూలు చేసినట్లు అధికారులు నిర్ధారించడంతో ఉన్నతా ధికారులు కేటీదొడ్డి ఎస్సై బి.శ్రీనివాసులును గద్వాల ఏఆర్‌కు అటాచ్ చేశారు.
పాగుంట జాతరలో వసూళ్లే కారణం
విచారణ చేసి నిర్ధారించిన అధికారులు
కేటీదొడ్డి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలో ని వెంకటాపురంలో జరిగిన పాగుంట లక్ష్మీ వేంకటేశ్వ ర స్వామి జాతరలో పోలీసు అధికారులు డబ్బులు వ సూలు చేసినట్లు అధికారులు నిర్ధారించడంతో ఉన్నతా ధికారులు కేటీదొడ్డి ఎస్సై బి.శ్రీనివాసులును గద్వాల ఏఆర్‌కు అటాచ్ చేశారు. సోమవారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన పాగుంట జాతరలో వసూళ్ల దందా అనే కథ నానికి స్పందించి అధికారులు విచారణ చేసి నిర్ధారిం చారు. పాగుంట వేంకటేశ్వర స్వామి జాతరలో బతు కుదెరువు కోసం గుడారాలు వేసుకొని వివిధ రకాల వ స్తువులను అమ్ముకునే వారితో వివిధ శాఖల అధికారు లతో పాటు పోలీసులు డబ్బులు వసూలు చేశారు. ఈ కారణంగానే మూడ్రోజుల క్రితం కేటీదొడ్డి పోలీస్ స్టేష న్‌లో పనిచేసే ఓ కానిస్టేబుల్‌ను గద్వాల ఏఆర్‌కు అటాచ్ చేశారు. దీంతో ఆ కానిస్టేబుల్ వసూళ్లకు తానొక్కడినే కారణం కాదని, ఎస్సై ప్రోద్భలంతోనే చేశా రని, తనను వాడుకొని వసూళ్లకు పాల్పడిన ఎస్సైపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. తన ఒక్కడిపైనే చర్యలు తీసుకుంటే స్టేషన్‌లో ఇప్పటివరకు జరిగిన అక్రమాలన్నింటినీ వెలుగులోకి తెస్తానని హె చ్చరించాడు. తనను వాడుకుని అక్రమ వసూళ్లకు పా ల్పడిన ఎస్సైపై కూడా చర్యలు తీసుకోవాలని లేదంటే ఎస్సై పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుంటానని వీడి యో రికార్డ్ చేసి పోలీసుల వాట్సప్ గ్రూప్‌ల్లో పెట్టాడ ని తెలిసింది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో డిలీట్ చేయించినట్లు తెలిసింది. బుధవారం ఎస్పీ శ్రీనివాసరావు, కేటీదొడ్డి ఎస్సై బి.శ్రీనివాసులును గద్వా ల ఏఆర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.