Share News

జిల్లాకు కొత్త అధ్యాపకుల రాక

ABN , Publish Date - Mar 13 , 2025 | 10:44 PM

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధనా కష్టాలు తీరనున్నాయి.

జిల్లాకు కొత్త అధ్యాపకుల రాక
దామరగిద్ద ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో రిపోర్ట్‌ చేస్తున్న కొత్త అధ్యాపకులు

- జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఎనిమిది

- పనిచేస్తున్న అధ్యాపకులు 101 మంది

- సర్వీస్‌ రెగ్యులరైజ్‌ అయిన వారు 57, 38 మంది గెస్ట్‌ లెక్చరర్లు

- కొత్తగా వచ్చిన వారు 37 మంది

నారాయణపేట, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధనా కష్టాలు తీరనున్నాయి. దాదాపు 13 ఏళ్ల తర్వాత జూనియర్‌ కళాశాలలో నూతన అధ్యాపకులు గురువారం అడుగు పెట్టారు. ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి ఈనెల 12న రవీంద్ర భారతిలో నూతన అధ్యాపకులకు నియామక పత్రాలు అందించారు. అందులో పేట జిల్లాకు 37 మంది ఉండడంతో గురువారం జిల్లాలోని ఎనిమిది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వారంతా జాయినింగ్‌ అయ్యారు. కొత్త అధ్యాపకుల సర్టిఫికెట్లను ఇంటర్‌ జిల్లా జోనల్‌ అధికారి సుదర్శన్‌రావు పరిశీలించారు. కొత్త అధ్యాపకులు విధుల్లో చేరడంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధన మరింత మెరుగుపడనుంది. ఏళ్లుగా జూనియర్‌ కళాశాలల్లో పదోన్నతులతో సరిపెడుతూ వచ్చారు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులర్‌ చేయడంతో ఖాళీలు తక్కువగా ఏర్పడ్డాయి. ఈ ఖాళీలతో 2022 డిసెంబరులో నోటిఫికేషన్‌ వేయగా 2023 సెప్టెంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించారు. కొత్త కాంగ్రెస్‌ ప్రభుత్వం 2024 జూన్‌లో ఫలితాలు విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలన అనం తరం నియామక పత్రాలు ఇవ్వడంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో ఆలస్యమై తాజాగా నియామక పత్రాలు అందించింది. అయితే జిల్లాలో ఇది వరకే పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లు 38 మంది, రెగ్యులర్‌గా 37 మంది కొత్తగా రావడంతో గెస్ట్‌ లెక్చరర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కాగా జిల్లాలో ఇదివరకు ఆరుగురు రెగ్యులర్‌ లెక్చరర్లు ఉండగా 59 మంది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేయడంతో 57 మంది పని చేస్తు న్నారు. పాతవారితో పాటు కొత్తవారిని కలిపి మొత్తం 102 మంది అధ్యాపకులు బోధన చేయ నున్నారు. అయితే నారాయణపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉర్దూ మీడియంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో గణితం, కామర్స్‌ లెక్చరర్ల పోస్టులు భర్తీ లేక కేవలం రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కొత్త అధ్యాపకులు ఇలా..

దామరగిద్ద, మక్తల్‌, నారాయణపేట, మాగ నూరు ప్రభుత్వ కళాశాలల్లో ఐదుగురు చొప్పున, ఊట్కూర్‌ కాలేజీకి ఏడుగురు, ధన్వాడ, కోస్గి కాలేజీలకు ముగ్గురు చొప్పున, మద్దూర్‌ కాలేజీకి నలుగురు కొత్త అధ్యాపకులు వచ్చారు.

Updated Date - Mar 13 , 2025 | 10:44 PM