రాష్ట్రావతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - May 20 , 2025 | 11:25 PM
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.
- కల్టెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట టౌన్, మే 20 (ఆంధ్రజ్యోతి): జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వే డుకలకు సంబంధించి ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లను తహసీల్దార్, మునిసిపల్ కమిషనర్‌లు కలిసి పర్యవేక్షించాలని, సీపీవో స్పీచ్‌కు సంబంధించిన వాటిని చూడాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు డీఈవో ఆధ్వర్యంలో, మైక్ ఇతర సదుపాయాలు డీపీఆర్‌వో నిర్వహించాలన్నారు. డీఎంహెచ్‌వో వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. అగ్నిమాపక, ఇతర సేవలను అందు బాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ జూన్ 2న పరేడ్ గ్రౌండ్‌లో అవతరణ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బారికేడ్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పర్యవేక్షిస్తామ న్నారు. సమావేశంలో డీఎస్పీ లింగయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
శాంతి సామరస్యంగా బక్రీద్ పండుగను జరుపుకోవాలి..
శాంతి సామరస్యంగా బక్రీద్ వేడుకలు నిర్వ హించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని కలెక్టర్ అధ్యక్షతన మంగళ వారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పశువుల, జంతు సంక్షేమ నియమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జంతు సంక్షేమం కోసం ఉద్ధేశించిన చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలన్నారు. పోలీస్ శాఖకు చెందిన అధికారులు నిరంతరం నిఘా ఉండేలా పర్యవే క్షణ చేయాలన్నారు. మసీద్, ఈద్గాల వద్ద శానిటేషన్‌పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీ, లింగయ్య, జిల్లా మైనార్టీ అధికారి రషీద్, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులున్నారు.