కళాశాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:02 PM
గద్వాలలో రూ.33.02కోట్ల నిధులతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాల, వసతిగృహ భవనాల మిగిలి ఉ న్న పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలె క్టర్ బీఎం సంతోష్ అన్నారు.
కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాలన్యూటౌన్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): గద్వాలలో రూ.33.02కోట్ల నిధులతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాల, వసతిగృహ భవనాల మిగిలి ఉ న్న పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలె క్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరె న్స్ హాలులో నర్సింగ్ కళాశాలతో పాటు, మెడికల్ కళాశాల విద్యార్ధుల వస తిగృహ ఏర్పాట్ల పనులు, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబరు నెలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖామంత్రి చేతుల మీదుగా నర్సింగ్ కళాశాల, వసతి గృహ భవనాల ప్రారంభోత్సవంతో పాటు రూ.130 కోట్ల నిధుల అంచనాతో మెడికల్ కళాశాల, వసతిగృహ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మెడికల్ కళాశాల విద్యార్థినులు ఉండే వసతిగృహంలో ఇంకా అవసరమైన మౌలిక వసతులు ఏమైనా ఉంటే వారంలోగా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. మెడికల్ కళాశాల సమీపంలోనే నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవన పనులు కూడా వేగవంతం చేయాలని, త్వరలోనే తాను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తానన్నారు. నర్సింగ్ కళాశాల చుట్టూ ప్రహరీ నిర్మాణం, ఇతర పనులు చేసేందుకు ప్రతిపాదనలు పంపిస్తే అవసరమైన నిధుల మంజూరుకు ప్రభుత్వానికి నివేదిస్తానన్నారు. సమావేశంలో టీజీఎంఎస్ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణుగోపాల్, డి ప్యూటీ ఈఈ శ్రీనివాసులు, ఏఈ రహీం, మెడికల్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కవిత, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతమ్మ, ప్రభుత్వ ఆసుప త్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిర, సూపరింటెండెంట్ రమేశ్, ఏవో శ్రీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.