Share News

బాగా చదువుకుంటున్నారా.?

ABN , Publish Date - Aug 21 , 2025 | 10:59 PM

బాగా చదువుకుంటున్నారా? ప్రతీ రోజు మంచి భోజనం అందిస్తున్నారా? అంటూ విద్యార్థినులతో రెవెన్యూ (విపత్తుల నిర్వహణ శాఖ) ప్రత్యేక ప్రధానకార్యదర్శి అరవింద్‌కుమార్‌ ఆరా తీశారు.

   బాగా చదువుకుంటున్నారా.?
చిట్టబోయిన్‌పల్లి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్న రెవెన్యూ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అరవింద్‌కుమార్‌

రెవెన్యూ (విపత్తుల నిర్వహణ శాఖ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌

విద్యార్థినులతో కలిసి భోజనం

జడ్చర్ల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : బాగా చదువుకుంటున్నారా? ప్రతీ రోజు మంచి భోజనం అందిస్తున్నారా? అంటూ విద్యార్థినులతో రెవెన్యూ (విపత్తుల నిర్వహణ శాఖ) ప్రత్యేక ప్రధానకార్యదర్శి అరవింద్‌కుమార్‌ ఆరా తీశారు. మండలంలోని చిట్టబోయిన్‌పల్లిలోని సాంఘిక, సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను గురువారం ఆయన సందర్శించి, పరిసరాలు, కిచెన్‌, స్టోర్‌ రూమ్‌ తదితర వాటిని పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ప్రతి రోజు పండ్లు ఇస్తున్నారా? బాగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని విద్యార్థినులకు సూచించారు. అంతకుముందు పాఠశాల ప్రధాన ద్వారం ముందు ప్రమాదకరంగా ఉన్న గుంతను పరిశీలించి, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు భారీ వర్షాల కారణంగా భూత్పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌ గ్రామ శివారులో ఉన్న రాందాస్‌చెరువు తండాకు వెళ్లే రోడ్డు ఐదు రోజుల క్రితం తెగిపోగా రోడ్డును పరిశీలించారు. బిడ్ర్జీ నిర్మాణం చేపట్టేటప్పుడు ఎందుకు చిన్నగా నిర్మించారని, ఇరుప్రక్కల ఎందుకు రాళ్లతో కట్టలేకపోయారని సంబంధిత శాఖ అధికారులను ప్రశ్నించారు. 30 ఏళ్లుగా ఇదే మొదటి సారి భారీ వర్షాలు, వరదలు వచ్చాయని అధికారులు బదులిచ్చారు. మళ్లీ అదే సంఘటన పునరావుతం కాకుండా చూడాలని ఇరిగేషన్‌ శాఖ డీఈఈ అబుబాకర్‌ సిద్దక్కి, మిషన్‌ భగీరథ ఈఈ శ్రీనివాస్‌ను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ విజయేందిర బోయి, ఎస్పీ జానకీ, అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్‌, నరసింహారెడ్డి, జడ్చర్ల, భూత్పూర్‌ తహసీల్దార్లు నర్సింగ్‌రావు, కిషన్‌నాయక్‌, ఎంపీడీవోలు విజయ్‌కుమార్‌, ఎంపీడీవో ప్రభాకర్‌చారి, భూత్పూర్‌ మునిసిపల్‌ కమిషనర్‌ నురూల్‌నజీబ్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు నవీన్‌గౌడ్‌ పాల్గొన్నారు.

చెరువుల మరమ్మతు చేపట్టాలి

పాలమూరు : జిల్లాలోని చెరువులు, కుంటలు మరమ్మతు చేపట్టడంతో పాటు కబ్జాలను నివారించాలని ముదిరాజు సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్‌ రెవెన్యూ (విపత్తుల నిర్వహణ శాఖ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మోదంకుంట-39.32, ఎర్రకుంట7-13, మైల్‌ దేవరకుంట 13-03, బాస్వయికుంట 9-23, మంగలికుంట 6-25, తాటికుంట 15-29, కొత్తకుంట 14-15, కొప్పులవానికుంట 14-14,క ూరలగడ్డ కుంట 2-11, అమ్మసముద్రం 6-05, గురిమిల్ల కుంట 5-24, ఎల్లారెడ్డి కుంట 11-07 మొత్తం 131.01 కుంటల భూమి ఆక్రమణకు గురైందని వివరించారు.

Updated Date - Aug 21 , 2025 | 10:59 PM