కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు
ABN , Publish Date - May 15 , 2025 | 11:24 PM
2025-26 విద్యా సంవత్సరానికి గాను కార్పొరేట్ కళాశాలలో ప్రవేశానికి అర్హు లైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ విద్యా ర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లికార్జున్ గు రువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, మే 15 (ఆంధ్రజ్యోతి) : 2025-26 విద్యా సంవత్సరానికి గాను కార్పొరేట్ కళాశాలలో ప్రవేశానికి అర్హు లైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ విద్యా ర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లికార్జున్ గు రువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2025 సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తీర్ణులై 7.0 జీపీఏ పైన లేదా 400 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ , తెలంగా ణ రెసిడెన్షియల్, ఎయిడెడ్, నవోదయ, కస్తూ ర్బా, బెస్ట్ అవైలబుల్, తెలంగాణ ఆదర్శ పాఠశా లలో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. హెచ్‌టీటీపీ:// తెలంగాణ ఈపాస్.సీజీజీ.జీవోవి.ఇన్ అనే వెబ్‌సైట్ లో ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ లోపు దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వి ద్యార్థుల లిస్టును జూన్ 5వ తేదీన ప్రచురి స్తారని ఆయన పేర్కొన్నారు.