Share News

శాకాంబరీదేవిగా అమ్మవారి దర్శనం

ABN , Publish Date - Jul 18 , 2025 | 10:55 PM

ఐదో శక్తిపీఠమైన జోగు ళాంబ అమ్మవారు శాకాంబరీ దేవి అలం కారణలోభక్తులకు దర్శనమిచ్చారు.

 శాకాంబరీదేవిగా అమ్మవారి దర్శనం
వివిధ పూలు, కూరగాయల అలంకరణలో జోగుళాంబ అమ్మవారు

- ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

అలంపూర్‌/అచ్చంపేటటౌన్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఐదో శక్తిపీఠమైన జోగు ళాంబ అమ్మవారు శాకాంబరీ దేవి అలం కారణలోభక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అ లంపూరు దేవస్థానం వారు, అర్చకులు జో గుళాంబ అమ్మవారిని వివిధ రకాల పం డ్లు, కూరగాయలతో సుందరంగా అలంక రించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి ఆలయంలో గణ పతి పూజ, స్పర్శ దర్శనం అమ్మవారి ఆల యంలో కుంకుమార్చన వంటి ప్రత్యేక పూ జలు చేశారు. ఈవో పురేందర్‌ కుమార్‌, చై ర్మన్‌ నాగేశ్వర్‌ రెడ్డి, ధర్మకర్తలు విశ్వనాథ రెడ్డి, జగదీశ్వర్‌ గౌడ్‌, నాగశిరోమణి, పులేం దర్‌, జగన్మోహన్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

భ్రమరాంబికాదేవి..

అచ్చంపేట పట్టణంలోని భ్రమరాంబికా దేవి ఆలయంలో అమ్మవారు శాకాంబరి దేవి అలంకరణలో శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడు ఉద య్‌భాస్కర్‌ ప్రత్యేక పూజలు చేశారు. మ హిళలు అమ్మవారిని దర్శించుకొని పూజ లు చేశారు.

Updated Date - Jul 18 , 2025 | 10:55 PM