కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
ABN , Publish Date - May 10 , 2025 | 11:42 PM
కార్మిక వ్య తిరేక నాలుగు లేబర్ కో డ్‌లను వెంటనే రద్దు చే యాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయు లు డిమాండ్ చేశారు.
వనపర్తి టౌన్, మే 10 (ఆంధ్రజ్యోతి) : కార్మిక వ్య తిరేక నాలుగు లేబర్ కో డ్‌లను వెంటనే రద్దు చే యాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయు లు డిమాండ్ చేశారు. శని వారం జిల్లా కేంద్రంలో సీ ఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ, ఎల్‌ఐసీ ఐసీ ఈయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ ప ట్టణంలోని పలు వీధులు, కాలనీల వెంట సాగి రాజీవ్ చౌరస్తాకు చేరుకుంది. అనంతరం రా జీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందేళ్లు పోరాడి సాధిం చుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి యాజమాన్యాలకు, పెట్టుబడిదారులకు మేలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చిందన్నారు. 20న నిర్వహించే దే శవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలు పునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మో ష, గణేష్, రాజు, రమేష్, మదన్, రాములు, సు నిత, బాలస్వామి, రత్నయ్య, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.