Share News

కార్మిక వ్యతిరేక విధానాలను ఖండించాలి

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:37 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు.

కార్మిక వ్యతిరేక విధానాలను ఖండించాలి

- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌

పెబ్బేరు, జూలై 15 (ఆంద్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం సీఐటీయూ జిల్లా 4వ మహాసభలు రెండవ రోజు విజయవంతంగా ముగిసింది. ముందుగా జెండాను ఆవిష్కరించి కార్మిక అమరవీరులకు నివాలర్పించి మా ట్లాడారు. మండలంలోని రంగాపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న ఏబీడీ కంపెనీ యాజమాన్యం కార్మికులపై అరాచకాలు ఆపాలని డిమాండ్‌ చేశారు. కంపెనీలో పని చేస్తున్న హమాలీ సంఘం రిజిస్ర్టేషన్‌ పేరు మార్పిడి చేసి డి.సి.ఎల్‌ మార్చాలని అధికారులను కోరారు. బొగ్గు, ఇతర గనుల నుంచి వచ్చే లాభాలలో 50శాతం సంబంధిత కార్మికులు, రైతులు, గిరిజన వర్గాల సంక్షేమం కోసం కేటా యించాలని సూచించారు. సీఐటీయూ కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మూడు సంవత్సరాల వరకు ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికను ప్రతినిధులు చర్చించి ఆమోదించారు. ఆవాజు సంఘం రాష్ట్ర అధ్యక్షు డు ఎండి.జబ్బార్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మి, సీఐటీయూ జిల్లా సహాయక కార్యదర్శి రమేష్‌, రవిప్రసాద్‌ గౌడ్‌, సూర్యవంశం రాము, బుచ్చమ్మ, నిక్సన్‌, బాలయ్య, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:37 PM